ఖమ్మం జిల్లాలో వింత జంతువు.. ఎన్నడూ చూడలేదంటున్న స్థానికులు

ఖమ్మం జిల్లాలో వింత జంతువు.. ఎన్నడూ చూడలేదంటున్న స్థానికులు

రాష్ట్రంలో వింత జంతువులూ కనిపిస్తున్నాయి. మొన్న యాదాద్రి జిల్లాలో వింత గబ్బిలం ఒకటి దర్శనం ఇచ్చింది.. ఇక ఇప్పుడు తాజాగా ఎలుకను పోలిన జింక పిల్ల ఒకటి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక్షమయ్యింది. జిల్లాలోని సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతమైన కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఇది కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకొని అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు.

Rare mouse deer found in kommepalli forest

అక్కడికి చేరుకున్న అటవీ శాఖా అధికారులు అది ముషీక జింక పిల్లగా గుర్తించి. దానిని కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అంతరించిపోతున్న జాతుల్లో మూషిక జింక కూడా ఒకటని, ఇది ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. అలాంటిది ఈ అటవీ ప్రాంతంలో ఇది కనిపించడం అరుదైన విషయమేనని అన్నారు. చాలా జింక జాతులు కనిమరుగై పోతున్నాయని.. వాటిలో ఇదికూడా ఒకటని తెలిపారు.

Tiny deer-like animal called silver-backed chevrotain spotted after 25  years - CNN Video

మీ అభిప్రాయం కామెంట్ చేయండి