ఖుష్బూ పోతే పోయింది.. కానీ కాంగ్రెస్ కు మంచి చేసి పోయింది

ఖుష్బూ పొతే కొంపలేం మునగవు.. బీజేపీకి నష్టం జరుగుతుంది

సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. అయితే ఆమె రాకను బీజేపీ వాళ్ళు కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దరిద్రం వదిలింది అన్నట్లు బావిస్తున్నారంట.. ఇక బీజేపీ నేతల అభిప్రాయాలను ఓ సారి పరిశీలిస్తే గతంలో బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఖుష్బూ తమ పార్టీలోకి స్వాగతించడం ఏంటని అంటున్నారు.. కాంగ్రెస్ అయితే ఖుష్బూ పోకడను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమె వలన పార్టీకి ఒరిగిందేమి లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. తమిళ రాజకీయాల్లో ఖుష్బూ ప్రాబల్యం జీరో అని చెప్పకనే చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

దీనిపై తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండూరావు స్పందించారు. ఖుష్బూ వెళ్లిపోవడంతో తమిళనాడులో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం జరగబోదని, ఆమె బీజేపీలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. ఖుష్బూలో సిద్ధాంతపరమైన నిబద్ధత లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆమె రాజీనామా తమిళ రాజకీయాల్లో ఏమంత ప్రాధాన్య అంశం కాదని వ్యాఖ్యానించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు