ఢిల్లీ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలు మగ బిడ్డకు జన్మను ఇచ్చింది.
బుధవారం రాత్రి 7:40 నిమిషాల సమయంలో ఇండిగో విమానం 6E 122 లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా 36 నెలలు నిండిన గర్భవతుల్ని విమానంలోకి అనుమతించారు.
విమానం ఎక్కిన మహిళకు 36 నెలలు నిండకపోవడంతో విమానంలోకి అనుమతించామని అయితే నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో విమానంలోనే ప్రసవం జరిగిందని సిబ్బంది వెల్లడించారు.
మహిళ ఢిల్లీ నుండి బెంగళూరుకు వస్తున్న సమయంలో నొప్పులు ప్రారంభం అయ్యాయి, సరిగ్గా అదే సమయానికి విమానంలో సీనియార్ గైనగాలజీ డాక్టర్ అందుబాటులో ఉండటంతో అందుబాటులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంకా క్యాబిన్ క్రూ సాయంతో మహిళకు డెలివరీ చేశారు.
విమానంలో ఉన్న సిబ్బంది బెంగళూరు కెంపేగౌడా ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ సిబ్బందికి ముందుగానే ఈ ఘటన గురించి రిపోర్ట్ చేశారు. “తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారు మరింత సమాచారం రావాల్సి ఉంది” అంటూ సమాచారాన్ని రికార్డు చేశారు.
Amazing scenes. Baby born mid-air on @IndiGo6E Delhi – Bangalore flight today, helped by the airline’s crew. 👏👏👍
Future IndiGo pilot perhaps. 😎#aviation #avgeek #india ✈ pic.twitter.com/0rJm7B5suQ
— Tarun Shukla (@shukla_tarun) October 7, 2020
అదృష్టవంతుడిగా మారిన బిడ్డ
విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అధికారులు మహిళ కోసం అంబులెన్స్ ను ఏర్పటు చేసి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ మహిళకు స్వాగతం పలికారు.
విమానంలో జన్మించిన బిడ్డకు జీవితకాలం పాటు విమాన ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఇది తమకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం అని వారు ప్రకటించారు.
అనేక మంది ప్రయాణికులు ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీసుకోవడానికి ఎంతో ఉత్సాహాం చూపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన ఈ ప్రకటన చూసిన అనేకమంది విమానంలో పుట్టిన ఆ బుడతడు భలే అదృష్టవంతుడు అంటూ కమెంట్లు పెడుతున్నారు.
Proud Moments –
Woman gives birth to baby boy aboard IndiGo flight travelling from Delhi to Bengaluru
Kudos to our 6ecrew who can be anything @IndiGo6E ♥️♥️♥️✈ pic.twitter.com/tFosA0zoh1
— Chaithu_beardguy✈ (@6eChaithu) October 7, 2020
గతంలో ఇలాంటి అనేక ఘటనలు – విమానాల్లో ఫ్రీ టిక్కెట్లు
గతంలో సైతం ఇలాంటి భారతీయ విమానాల్లో ఇలాంటి ఘటనలు రెండు సార్లు చోటు చేసుకున్నట్టు రికార్డులు ఉన్నాయి. 2009 సంవత్సరంలో ఎయిర్ ఏషియా విమానంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు సైతం వారు ఉచిత విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.
ఇక ఇదే విధంగా 2017 లో జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు జెట్ ఎయిర్ వేస్ దుబాయ్ – ఇండియా మధ్య తిరిగే తమ విమానాల్లో ఆ బిడ్డకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.
మనం ముందే చెప్పుకున్నట్టు , నెలలు నిండిన గర్భవతుల్ని విమాన ప్రయాణానికి అధికారులు అనుమతించరు. అయితే కొన్ని సార్లు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో నెలలు నిండకుండానే నొప్పులు మొదలై ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి.