తుపాకీ పట్టిన కొడాలి నాని

తుపాకీ పట్టిన కొడాలి నాని

కొడాలి నాని, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నేతల్లో ఫైర్ బ్రాండ్, విమర్శలు చేయడంలో దిట్ట, తెలుగుదేశం వారిని టార్గెట్ చేసి మాట్లాడటంలో నేర్పరి.. అత్యంత ప్రజాదరణ, అభిమాన గణం ఉన్న కొడాలి. ఎప్పుడు ఎవరిమీదనో ఒకరిమీద హాట్ కామెంట్స్ చేసి వార్తలో ఉంటారు. ఇక ఈ సారి మాత్రం గన్ చేతబట్టి వార్తల్లో నిలిచారు. కృష్ణా జిల్లా గుడివాడ ఒక‌ట‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో మంత్రి కొడాలి నాని చేత్తో తుపాకీ ప‌ట్టుకుని క‌నిపించారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడాలి నాని హాజరయ్యారు. ప్రదర్శనలో ఉన్న గన్స్ ని చేత్తో పట్టుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరంతరం సమాజ శ్రేయస్సుకోసం పనిచేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని అన్నారు. ఆపద వచ్చింది అంటే ముందుంటారని అన్నారు. ప్రజలను రక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమైనదని కొడాలి అన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి