పోలీసు తుటా ముందు నా గుండె దాటి వెళ్లాలి :- కోమటిరెడ్డి

పోలీసు తుటా ముందు నా గుండె దాటి వెళ్లాలి :- కోమటిరెడ్డి

ఫార్మాసిటీ విషయంలో ప్రజల పక్షానే నా పోరాటం..

ఫార్మా సిటీ ఏర్పాటు కేవలం కేసీఆర్ సంపాదన కోసమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.. రైతుల వద్ద భూములను లక్షల రూపాయల్లో కోనుగోలు చేసి ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయలకు కేసీఆర్ అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఫార్మాసిటీ పేరుతో రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. చౌటుప్పల్ ప్రాంతంలో ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే అక్కడ ప్రజలు అనేక రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారని. ఇప్పుడు వేల కంపెనీలు వస్తే కాలుష్యం పెరిగి ఇక్కడ ప్రజలు బతకడం కూడా కష్టమైపోతుందని అన్నారు.

మూడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు 20వేల ఎకరాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఫార్మాసీటీపై ప్రధానమంత్రితో చాలా సార్లు చర్చించానని ఆయన మంత్రి ప్రకాశ్ జావేదకర్‌కు చెప్పారని తెలిపారు కోమటిరెడ్డి. ఆయన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయించారని వివరించారు.

కానీ ప్రజాభిప్రాయ సేకరణ అంతా అబద్ధం అని టీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజమైన ప్రజాభిప్రాయం కావాలంటే మా ప్రాంతానికి రావాలని చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు.

ఫార్మా సిటీకి శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ ముందుండి పోరాటం చేస్తుందని. పోలీసులు ఎంత మంది వచ్చినా వెనక్కు తగ్గేది లేదని.. తుటాలు ముందు కోమటిరెడ్డి గుండె దాటి వెళ్లాలని ఘాటుగా మాట్లాడారు.. మీ ముందు నేనుండి పోరాడతా..!

నేను మీకు అండగా ఉంటా..! ఇందిరమ్మ భూమి లేని వారికి భూములు ఇస్తే.. కేసీఆర్ పేదల భూములను లాక్కుంటున్నాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తాడు. దొడ్డిదారిన ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని.

ఇప్పటికే కేసీఆర్ ఎల్.ఆర్.ఎస్ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఫార్మా సిటీ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను మీ పోరాటంలో ముందుంటాను అని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు

దళితుల భూములు ఆక్రమించుకోవడం దారుణం..! మునగనూరు గ్రామం,అబ్దుల్లాపూర్ మెట్ మండలం,రంగారెడ్డిజిల్లా సర్వే నెంబర్ 120లోగల 67 ఎకరాల 19 గుంటల ఆక్రమణపై దళితులు చేస్తున్న న్యాయ పోరాట శాంతియుత ధర్నాకు నేను సంఘీభావం ప్రకటిస్తున్నాను. దళితులకు తక్షణమే న్యాయం చేయాలనేదే నా డిమాండ్..!

Posted by Komatireddy Venkat Reddy on Sunday, October 11, 2020

మీ అభిప్రాయం కామెంట్ చేయండి