Breaking News రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఉద్యమం 18 వ రోజుకు చేరుకుంటుంది. 18 రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటున్నారు. ఇక మరో వైపు ఆదివారం రాజస్థాన్ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ చేరుకోనున్నారు. ట్రాక్టర్ ర్యాలీతో రైతులు బయలుదేరారు.

కాగా దేశ వ్యాప్తంగా రైతులకు అనూహ్య మద్దతు లభిస్తుంది. ఇప్పటికే 24 పార్టీలు రైతులకు మద్దతు తెలిపాయి. ఇక క్రీడాకారులు, ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. శనివారం యువరాజ్ సింగ్ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపగా ఈ రోజు ఏకంగా పంజాబ్ జైళ్ల శాఖా డీఐజీ రాజీనామా చేశారు.

రైతు సోదరులకు మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నాని డీఐజీ లక్మీందర్​ సింగ్ ప్రకటించారు. రైతు సోదరులు 18 రోజులుగా ఉద్యమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రైతులకు మద్దతుగా తాను రాజీనామా సమర్పించానని పేర్కొన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు