బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ డీటాక్స్ వాటర్ ఇంట్లోనే చేసుకోండి

drink this detox water every day to reduce belly fat

ఈ  రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ లు చేద్దామంటే బద్దకం వల్లనో లేక బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగానో చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్న వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ని పూర్తిగా తగ్గించలేనప్పటికి కాస్త కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లోనే బెల్లం – నిమ్మకాయ నీరు ప్రతి రోజు తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నా న్యూట్రీషన్ నిపుణులు .

ఎలా తయారు చేసుకోవాలి ? 

బెల్లం – నిమ్మకాయల నీళ్లను తయారు చేసుకోవడంలో పెద్ద ట్రిక్ ఏమి లేదు.ఒక గ్లాసు నీళ్లు , ఒక టిస్పూన్ నిమ్మ రసం, చిన్న బెల్లం ముక్క ( 10 -20 గ్రాములు ) లేదా మీ టేస్ట్ కు సరిపడినంత. ఈ మూడిని కలిపి చక్కగా మిక్స్ చేసుకుంటే.. మీ డీ టాక్స్ డ్రింక్ రెడీ అయినట్టే. ఈ బెల్లం నిమ్మకాయ నీళ్లను ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మొత్తం లివర్ బయటకు ఫ్లష్ చేసేస్తుంది. 10 – 15 రోజుల్లోనే మీరు ఆ తేడాను గమనిస్తారు కూడా. అయితే ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి .

వీటిల్లోని ప్రత్యేకత ఏంటి ?

నిమ్మకాయలు విటమిన్ సి తో ఎక్కువగా ఉంటుంది, ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు మీ బాడీ మెటాబాలిజాన్ని పెంచుతుంది. నిమ్మకాయలలో ఉండే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు శరీర బరువును కంట్రోల్లో ఉంచడానికి సాయం చేస్తాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడ్డ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి,మంచి HDL కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సాయం చేస్తుంది.

ఇక బెల్లం విషయానికి వస్తే ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బెల్లంలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని ఐరన్ ,ఎలక్ట్రోలైట్లను బ్యాలన్స్ చేయడంలో సాయం చేయడమే కాక శ్వాసకోశ మరియు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు