#ఆయుర్వేధం తెల్లజుట్టు నల్లగా మారాలంటే – బోడతరం పువ్వును తప్పక వెతికిపట్టుకోండి

bodataram or bodasaram flowers and uses

ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ సమస్య చక్కగా నల్లగా ఉండాల్సిన జుట్టు తెల్లగా నిగలాడిపోతు ఉండటం. అతి తక్కువ వయస్సులోనే చాలా మందిని ఈ సమస్య అధికంగా వేధిస్తుంటుంది. ఆయుర్వేధ గ్రంథాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అనేక రకాలైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక విధానమే బోడతరం పువ్వు వాడకం. ఈ పువ్వు సైంటిఫి నేమ్ స్ఫెరెంథస్ ఇండికస్ Sphaeranthus indicus .

వరి పొలాల్లో దొరికే బోడతరం

బోడతరం లేదా బోడసరం పువ్వులు ఎక్కువగా వరిపంట పొల్లాల్లో కనిపిస్తుంది. వరి పైరులో కనపడే తెల్లని లేదా ఎర్రని పోవులే ఈ బోడతరంపువ్వులు. ఇవి ఎలా ఉన్నాయో పైన మీకు ఫోటో కనిపిస్తుంది. ఈ బోడతరం పువ్వు కేవలం తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాక, కంటి చూపును సైతం మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు తీసుకోవడం వల్ల యవ్వనంగా కూడా ఉంటారని ఆయుర్వేధ గ్రంథాలు చెబుతున్నాయి

ఎలా వాడుకోవాలి – ఎలా తయారు చేసుకోవాలి

పొలాల్లో దొరికే ఈ బోడతరం పువ్వులను తెచ్చి బాగా ఎండబెట్టుకోవాలి . బాగా ఎండిన ఈ పువ్వులను మిక్స్ లేదా గ్రైండ్ చేసుకోని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొడిగా తయారుచేసుకున్న దీన్ని ప్రతి రోజు మూడు గ్రాముల చొప్పున గ్లాసుడు నీళ్లలో కలుపుకోని తాగాలి. ఇలా నెలల తరబడి చేయడం వల్ల కలిగే మార్పును ప్రత్యక్షంగా మీరే గమనించవచ్చు.

బోడతరం లేదా బోడసరం పువ్వును ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని ప్రముఖ ఆయుర్వేధ నిపుణులు  డాక్టర్ ప్రదీప్ వానపల్లి తన ఫేస్ బుక్ పేజీలో వీడియో ద్వారా చక్కగా వివరించారు ఒక సారి చూడండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు