ఇంట్లో ఒకరికి కరోనా వస్తే.. అందరికీ వచ్చినట్లే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది

corona infection over the family

కరోనా వైరస్ రూపు మార్చుకుంటుంది.. లక్షణాలు లేకుండానే.. తీవ్రమైన స్థాయిలో బయటపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక భారతీయులను భయాందోళనలకు గురి చేస్తుంది.

ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చినట్లయితే.. ఇంట్లోని మిగతా అందరికీ వైరస్ సోకుతుందని.. ఇది 80శాతంగా ఉందని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ ఓ. ప్రస్తుతం భారతదేశంలో ఇదే పరిస్థితి ఉందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

కరోనా వైరస్ వ్యాప్తి సాధారణ గదుల్లో.. గాల్లో మూడు అడుగుల వరకు వ్యాప్తి ఉంటే.. ఏసీ గదుల్లో 20 అడుగుల వరకు వ్యాప్తి జరుగుతుంది. మధ్యతరగతి, పేదలు, సాధారణ ప్రజలు దేశంలో 80 శాతం మంది ఉన్నారు. ఇప్పటికీ సింగిల్ బెడ్ రూం.. ఒకే గదిలో కుటుంబం మొత్తం నివాసం ఉంటున్నారు ప్రజలు. దీని వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని.. దీని వల్లే ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే.. మిగతా అందరికీ కామన్ గా వచ్చేస్తుందని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.

కరోనా వచ్చిన తర్వాత హోం క్వారంటైన్ వల్ల వ్యాప్తి అధికంగా ఉంటుందని మన దేశంలో. వైరస్ వ్యాప్తి దూరం అధికంగా ఉండటమే దీనికి కారణంగా స్పష్టం అయ్యింది. కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే.. వెంటనే సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అలా వీలు కాని పక్షంలో.. క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలని స్పస్టం చేస్తున్నారు. దీని వల్ల కుటుంబ సభ్యులను రక్షించుకున్న వారు అవుతారు.

సింగిల్ బెడ్ రూం.. ఓ హాలు, వంటగది మాత్రమే ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు సైతం వైరస్ సోకుతుందని.. 45 ఏళ్లలోపు వారు 65 శాతం మంది కరోనా బారిన పడటానికి.. కుటుంబ జీవన పరిస్థితులు కారణం అవుతున్నాయని వెల్లడించారు పరిశోధకులు.

తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరే కాదు.. మీ కుటుంబం మొత్తం కరోనా బారిన పడుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు