స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు మరిన్ని వచ్చాయి. కేవలం కంటైన్ మెంట్ జోన్లలో ఆంక్షలు. మిగతా ప్రాంతాల్లో ఫ్రీ. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. మందు షాపులు ఎప్పుడో ఓపెన్ చేశారు. జన జీవనం యథావిధిగా జరుగుతుంది.

స్టే హోం కాదు.. స్టే అలర్ట్ 

ప్రజలు అంతా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేశంలో లక్ష కేసులు నమోదు అయ్యాయి. 5వేలు ఉన్నప్పుడు లాక్ డౌన్ పెట్టి.. లక్ష కేసులు ఉన్నప్పుడు వదిలేయటం ఏంటీ అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 5వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టే హోం నినాదం పాత అయిపోయింది. ఎందుకంటే ఎవరికి వారు బయటకు వచ్చేస్తున్నారు. సో.. ఇక నుంచి స్టే హోం కాదు.. స్టే అలర్ట్ నినాదం మంచిది అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కన్ఫ్యూజ్ వద్దని.. జస్ట్ స్టే అలర్ట్ అంటూ ముందుకు సాగాలని అంటున్నారు.

కన్ఫ్యూజ్ అవుతున్న ప్రజలు 

ఇప్పటి వరకు జరిగింది ఒకటి.. ఇక జరగబోతున్నది ఒకటి అంటున్నారు వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు. లాక్ డౌన్ కు కాదు.. కరోనాకు గేట్లు ఎత్తింది ప్రభుత్వం అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎలాంటి ఆందోళన, కన్ఫ్యూజ్ కాకుండా ముందుకు సాగాలి అంటున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటమే ముఖ్యం అంటున్నారు. అప్పుడే కరోనా నుంచి దూరంగా ఉంటామని చెబుతున్నారు. కరోనాతో సహజీవంతోపాటు కాపురం కూడా చేయాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. స్టే అలర్ట్ నినాదంతోనే దీన్ని దూరం చేయొచ్చు అంటున్నారు.

వ్యాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ 

వాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ సో బెటర్ అంటున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఇతరులకు దూరంగా ఉంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. విధిగా మాస్క్ లు ధరించటం, బయట తిరిగే సమయంలో శానిటైజర్ దగ్గర పెట్టుకోవటం, ఇతరుల ఆఫీసులకు వెళ్లినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, వారితో మాట్లాడటం వంటి చేయకూడదు అని చెబుతున్నారు. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయటం లేదా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవటం ఎంతో మంచిది అంటున్నారు. అదే విధంగా దుస్తులు కూడా దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

స్టే హోం అనేది పాత నినాదం.. ఇక నుంచి స్టే అలర్ట్ అనేది కొత్త నినాదం. కరోనాతో సహజీవనం చేస్తూనే.. అప్రమత్తంగా ఉండటం అనేది ఇప్పుడు చేయాల్సిన పని..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు