పోర్న్‌ చూస్తున్నారా?.. మెసేజ్‌ వస్తుంది!

దేశంలో పోర్న్ వీడియోలు చూసే వారిసంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి రోజు ఖర్చవుతున్న డేటాలో 30 శాతం పోర్న్ వీడియోలకె ఉపయోగిస్తున్నారట. పురుషులే కాదు.. ఇక పోర్న్ వీడియోలు చూసే మహిళల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలను ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తే ‘యూపీ ఉమెన్‌ పవర్‌లైన్‌ 1090’కు అలర్ట్‌ వెళ్లిపోతుంది. దీంతో 1090నుంచి సదరు వ్యక్తికి అవగాహాన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వస్తుంది. ఆరు జిల్లాల్లో విజయవంతమైన ఈ ప్రాజెక్టుకు ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

అయితే పోర్న్ వీడియోలు చూడటం వలన దేశంలో లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని బ్యాన్ చేస్తే సగం లైంగిక నేరాలు తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఏడీజీ నీరా రావత్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంటర్‌నెట్‌ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడానికి 1090 దోహదపడుతుందని అన్నారు. డేటా యూసేజ్‌ ఆధారంగా ప్రజలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారన్న దానిపై ఓ కన్నేసి ఉంచుతామని తెలిపారు. ఎవరైనా పోర్న్ సైట్స్ సంబంధిత వాటిని సెర్చ్ చేస్తే వెంటనే 1090 నుంచి సమాచారం వెళ్తుంది. వారి డేటా పోలీసులు, 1090 వద్ద నిక్షిప్తమై ఉంటుంది‌’’ అని అన్నారు.

పోర్న్‌ చూస్తున్నారా?.. మెసేజ్‌ వస్తుంది!

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు