“విమానముద్ర”యోగాతో అదరగొడుతున్న పూజ హెగ్డే

Pooja_hegde

సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందాలతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటేనే హీరోయిన్ గా నిలదొక్కుకుంటారు. సినీ తారలు పరిశ్రమలో పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే అందాన్ని, ఆకృతిని కాపాడుకోవాలి. అప్పుడే వారికి అవకాశాలు వస్తాయి. తెలుగు సినిమాలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లుగా పేరు తెచ్చుకున్న కాజల్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్, సమంతా ఇంకా పలువురు హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా జిమ్ లు మూసేయడంతో, ఇంటివద్దనే ఉంటున్న ఈ భామలు ఎటువంటి కసరత్తులు చేస్తున్నారో చూద్దామా?

“పూజ హెగ్డే” ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. వరుస హిట్లతో ఇటు తెలుగుతో పాటు ఇటు హిందీలోను దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ బుట్టబొమ్మ, లాక్ డౌన్ కారణంగా గత 80 రోజులుగా ఇంటివద్దనే ఉంటుంది. ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకునే పూజ, ఈ లాక్ డౌన్ సమయంలోనూ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తూనే ఉంది. ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను ఇమేజ్ లను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను కనువిందు చేస్తుంది పూజ

తాజాగా పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో అభిమానులను “వావ్” అనిపిస్తుంది. ఒంటికాలిపై నిలబడి.. సాష్టాంగ నమస్కారం పోజులో పూజ చేసిన యోగా ఆసనం ఆకట్టుకుంటుంది. యోగా భాషలో దీన్ని వీరభద్రాసనం అంటారు. ఈ యోగ ముద్రలో పూజ ఎంతో అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు