ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనా

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల రగడ ఇంకా తగ్గలేదు.. కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారు.. నాటి నుంచి ఎన్నికల కమిషనర్ కి. ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమన్నట్లుగా ఉంది.

నిమ్మగడ్డని తొలగించాలని చూసినా అది సాధ్యం కాలేదు. ఇక ఈ నేపథ్యంలోనే మంత్రులు వ్యాఖ్యలు చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవని అర్ధం అవుతుంది. ఇక ఎన్నికల కమిషనర్ మాత్రం అల్ పార్టీ మీటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్థానిక ఎన్నికలపై అక్టోబర్ 28 న అల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సమావేశానికి అధికార పార్టీనేతలు హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇక ఈ నేపథ్యంలోనే కొడాలి నాని మాట్లాడుతూ ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించే ఆలోచ‌న లేద‌ని చెప్పారు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామంటే కుద‌ర‌ద‌న్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ రాష్ట్రంలో కొన్ని నెల‌లే ఉంటార‌ని, ఆ త‌రువాత హైద‌రాబాద్‌లో ఉంటార‌ని మంత్రి మండిప‌డ్డారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు