ప్రేమ జంటను కారుతో ఢీకొట్టారు.. అనంతరం కర్రలతో దాడి చేశారు..

ప్రేమ జంటను కారుతో ఢీకొట్టారు.. అనంతరం కర్రలతో దాడి చేశారు..

కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు నచ్చలేదు.. ఎలాగైనా భర్త నుంచి విడదీయాలని ప్లాన్ వేశారు.. పెళ్ళైన 15 నెలలకు బలవంతంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి బైక్ పై వెళ్తున్నారని కారుతో ఆక్సిడెంట్ చేశారు.. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.. యువతి పరిస్థితి కొద్దిగా మెరుగుగా ఉంది..

వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా బైంసాలోని అంబెడ్కర్ నగర్ కాలానికి చెందిన నాగజ్యోతి, అదే కాలానికి చెందిన అక్షయ్ ప్రేమించుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 28 న బైంసాలోని బుద్ధివిహార్ లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు.

రెండు నెలల క్రితం తండ్రికి గుండెపోటు వచ్చిందని నాగజ్యోతిని ఇంటికి రప్పించి నిర్బంధించారు. బలవంతంగా ఆగస్టు 20న విడాకులు తీసుకున్నారు. అది ఇష్టం లేని ఆ యువతి తన భర్తకు విషయం చెప్పింది. బుధవారం డిగ్రీ పరీక్ష రాసేందుకు కల్లూర్‌కు వచ్చి అతనితో పాటు బైక్‌పై వెళ్లిపోయింది.

ఇది తట్టుకోలేపోయిన యువతి బంధువులు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కారుతో ఢీకొట్టిన తర్వాత కర్రలతో యువకుడిపై దాడి చేశారు.. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇక యువతికి కూడా గాయాలయ్యాయి.. వీరిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు..

కాగా ఘటనపై బైంసా రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి