లవ్ జీహాద్ కు చెక్ పెట్టేలా కొత్త చట్టం

లవ్ జీహాద్ కు చెక్ పెట్టేలా కొత్త చట్టం

దేశంలో లవ్ జిహాద్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులు అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రేమించే సమయంలో ఒక మతం పేరు చెబుతూ పెళ్లి జరిగిన తర్వాత తమ అసలు మతం చెప్పి యువతులను మతం మారుస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పై కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. తమ గుర్తింపును దాచిపెట్టి, మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని వారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. కాగా పెళ్లికోసం మతం మారడం అవసరం లేదని తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇతర మతం గురించి ఎలాంటి అవగాహన, నమ్మకం, విశ్వాసం లేకుండా మతం మారి వివాహం చేసుకోవడం అంటే బలవంతపు మతమార్పిడేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఓ యువతి ఈ ఏడాది జూన్ 29 న తన ప్రియుడి మతంలోకి మారి జులై 31 న పెళ్లి చేసుకుంది. మతం మారిన యువతి తమ వైవాహిక జీవితంలో తమ తండ్రి జోక్యం చేసుకోకుండా చూడాలని ఆమె భర్తతో కలిసి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, పెళ్లికోసం మతం మారాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.

అవగాహన లేకుండా మతం మారడం అనేది బలవంతపు మతమార్పిడి అని తెలిపింది కోర్టు. ఇక లవ్ జిహాద్ పై కొత్త చట్టం తెచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్దమవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి