OTT మూవీ రివ్యూ : మా వింతగాథ వినుమా ఆకట్టుకోలేదు – మధ్యలోనే ఎగ్జిట్

నెటిజన్ల సహనాన్ని పరీక్షించింది. స్టార్టింగ్ లో స్టోరీ అర్థం అయిపోవటంతో.. మధ్యలో ఎగ్జిట్ అయ్యారు నెటిజన్లు. ఓటీటీకి తగ్గ కంటెంట్ కాకపోవటం విశేషం.

తినగతినగ గారెలు చేదుగా ఉంటాయి.. షుగర్ ఎక్కువ అయినా వెగటు వస్తోంది.. అలాంటిది ఓటీటీలో రిలీజ్ అయిన సోషల్ మీడియా లవర్ స్టోరీ మా వింత గాథ వినుమా.. ఏ మాత్రం ఆకట్టుకోలేదు. రొటీన్ బోర్ స్టోరీ.. అందులోనూ ఓటీటీ చూడటం అంటే అయ్యబాబోయ్ అంటున్నారు. థియేటర్లు లేకపోవటంతో ఆహాలో విడుదలైన ఈ సినిమా.. నెటిజన్ల సహనాన్ని పరీక్షించింది. స్టార్టింగ్ లో స్టోరీ అర్థం అయిపోవటంతో.. మధ్యలో ఎగ్జిట్ అయ్యారు నెటిజన్లు. ఓటీటీకి తగ్గ కంటెంట్ కాకపోవటం మరో విశేషం.

కృష్ణ అండ్ హిజ్ లీల ల‌వ్‌స్టోరీతో పర్వాలేదు అనిపించిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ, సీర‌త్‌క‌పూర్‌ జోడీగా వచ్చిన కొత్త మూవీ మా వింత గాథవినుమా.. లేడీస్ హాస్ట‌ల్ ఎదుట వాచ్‌మెన్‌తో గొడ‌వ‌ప‌డుతున్న హీరోను పోలీసులు అరెస్ట్ చేస్తారు. హీరో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింద‌ని తెలుసుకున్న ఆ పోలీస్‌.. అతని క‌థ వింటాడు. ఇంజ‌నీరింగ్ చదివే సమయంలోనే హీరో.. రెండేళ్లు ప్రేమించి ఐ ల‌వ్‌యు చెబుతాడు. అయినా పట్టించుకోలేదు. అయినా వెంటపడుతూనే.. కష్టాల్లో ఉన్న హీరోయిన్ ను ఆదుకుంటాడు. అలాంటి సాయాన్ని కూడా రూల్స్ బ్రేక్ చేసి చేశాడని అసహ్యించుకుంటోంది.

లవర్స్ గా కాదు.. ఫ్రెండ్‌గా మారిన క్రమంలోనే.. లవ్ పుడుతోంది. ఈ సమయంలో హీరోయిన్, తన అన్నయ్యతో కలిసి గోవా వెళుతుంది. అక్కడ జరిగిన ఘటనలతో మెంటల్ అవుతుంది. తన ప్రేమ గొప్పదని చెప్పుకోవటానికి పెళ్లి చేసుకుంటాడు హీరో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు కుంటుంబాల‌కు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కథ సుఖాంతం ఎలా అయ్యింది అనేది సినిమా స్టోరీ.

ఓటీటీలో చూసే సినిమానేనా ఇది అనిపిస్తోంది. థియేటర్లు టికెట్ కొనుక్కుంటే నచ్చినా నచ్చకపోయినా శుభం కార్డు వరకు చూడాల్సిందే. ఓటీటీ అలా కాదు.. ముందుకు, వెనక్కు.. అన్నింటికి మించి ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సినిమా చూస్తేమద్యలో ఎగ్జిట్ అయ్యారు నెటిజన్లు. రివ్యూ రాయటానికి కూడా చివరి వరకు చూడాల్సిన పని లేదు అనిపిస్తోంది. ల‌వ్‌స్టోరీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. ఆడియన్స్‌కు క‌నెక్ట్ కారు. క్యారెక్టర్లు చూపించిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దర్శకుడు ఆదిత్య మండలి ఏం చెప్పాలి అనుకున్నాడో అది సరిగాచెప్పలేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి