తమిళనాడు రాష్ట్రం ధర్మపురి తొప్పూరు ఘాట్ దగ్గర శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ఒళ్లు వణికిపోతుంది.. నరాల తెగిపోతాయి.. అమ్మో ఈ రోడ్డు యాక్సిడెంట్ ఏంటీ.. పగోడికి సైతం ఇలాంటి చావు వద్దు అనుకుంటారు.. అవును అచ్చం ఇలాగే ఉంది ఈ దృశ్యాలు చూసినవారికి. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నడపటం వల్ల 13 కార్లు, రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. 10 మందిపైనే చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అతి వేగంగా వచ్చిన లారీ.. కార్లను ఢీకొంటూ ముందుకు వెళ్లింది.. అయినా సరే లారీ డ్రైవర్ మాత్రం అదుపు చేయకుండా చేతులెత్తేశాడు. లారీ వేగానికి కార్లు అన్నీ ఒకదానికి ఒకటి ఢీకొని.. నుజ్జునుజ్జు అయ్యాయి.
కొన్ని గంటలపాటు కార్లలో చనిపోయిన వారిని బయటకు తీయటానికి సాధ్యం కాలేదు అంటే ఎంత ఘోరంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు.
రోడ్డుపై ఉండాల్సిన ఓ కారు లారీపైన ఉండటం చూస్తుంటే యాక్సిడెంట్ బీభత్సం హాలీవుడ్ సినిమాను తలపించింది అనొచ్చు. రెండు లారీలు చేసిన ఈ ప్రమాదంతో 15 కార్లలోని ప్రయాణికులు అందరూ తీవ్రంగా గాయపడటమే కాకుండా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.