పెళ్ళైన 15 రోజులకే భర్త మృతి.. తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన డాక్టర్

ఇద్దరు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసుండాలని గత నెల 30 న పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 15 రోజులకే భర్త మృతి చెందాడు.. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు ఆ భాదను తట్టుకోలేక భార్యకూడా భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. అయితే ఈ తరుణంలోనే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సూసైడ్ నోట్ దొరికింది.

పూర్తి వివరాల్లోకి వెళితే

ఫరీదాబాద్‌కి చెందిన సానియా ఖండేల్‌వాల్ మెడిసిన్ చదివేందుకు నాలుగేళ్ల కిందట ఉజ్జయిని వచ్చింది. సివిల్ కాంట్రాక్టర్ అయిన శుభం ఖండేల్‌వాల్‌‌తో పరిచయమై ప్రణయానికి దారితీసింది. అనంతరం పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి చేసుకున్న కొద్దీ రోజులకే ఈ ఘోరం జరిగింది. అయితే భర్త శుభం ప్రమాదంలో చనిపోలేదు.. కొందరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తీసుకోని కారు నడిపాడు. ఓపిక లేకపోవడంతో చెట్టుకు డీకొట్టాడు.. అయితే మొదట పోలీసులు పోస్ట్ మార్టం చెయ్యకుండానే మృతదేహాన్ని కుటుంబ సబ్యులకు అప్పగించారు. తర్వాత కారును పరిశీలించగా వాంతులు చేసుకున్నట్లుగా ఉంది. వెంటనే మృతుడి ఇంటికి వెళ్లగా అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి. అతడు వేసుకున్న ప్యాంటు జేబులు పరిశీలించగా రెండు సూసైడ్ నోట్లు లభించాయి.

లెటర్ లో ఈ విధంగా రాసిఉంది. సివిల్ కాంట్రాక్టర్‌గా ఉన్న శుభంకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు రూ.13 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అవి రాకుండా అక్కడి సబ్ ఇంజినీర్లు నరేష్ జైన్, సంజయ్ ఖుంజేర్ అడ్డుపడుతున్నారని.. తనను వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి పేరిట రెండు సూసైడ్ నోట్‌లు రాసుకుని జేబులో పెట్టుకున్నట్లు గుర్తించారు. ఇంజినీర్లు ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్థాపంతో విషం తాగేసిన శుభం కారులో పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. వాంతుల ఆధారంగానే పోలీసులు విషం తీసుకున్నట్లు గుర్తించారు. ఇక లెటర్ లో ఉన్న వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.. కాగా భార్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి