పెళ్లి కొడుక్కి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.. తాళి కట్టే సమయంలో అడ్డుకుంది. 

పెళ్లి కొడుక్కి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.. తాళి కట్టే సమయంలో అడ్డుకుంది.

పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్ అయిపొయింది. ముహూర్తం సమయం దగ్గరకు వచ్చింది. పెళ్లి పీటలు ఎక్కారు. చివరి నిమిషంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి షాక్ ఇచ్చింది. తాళి కట్టొదంటూ తెగేసి చెప్పింది. తన ప్రియుడు అరగంటలో వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడని బంధువులు, పెళ్లి పెద్దల సాక్షిగా అరిచింది.

దింతో పెళ్ళికొడుకు షాక్, మండపం అంతా సైలెంట్. ఈ వింత ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని మట్టకండి గ్రామంలో చోటు చేసుకుంది. అందరి ముందూ ఆమె చేసిన పనికి పెళ్లి కొడుకుతో సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

వివాహ వేడుకనుంచి వరుడుతోపాటు వారి బంధువులందరూ వెళ్లిపోయారు. కొద్దీ సేపటి తర్వాత ప్రియుడు వచ్చి పెళ్లికూతురు మేడలో తాళికట్టాడు. కాగా కరోనా కావడంతో బంధువులు చాలా తక్కువ మంది వచ్చారు. దింతో ఎటువంటి గొడవ జరగలేదు.

కూతురు ఆలా చేసిన ఆ సమయంలో తల్లి తండ్రులు ఏమి అనలేని పరిస్థితి. చేసేదేమిలేక ప్రియుడితోనే పెళ్లి జరిపించారు. అక్టోబర్ 29 తేదీ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి