ఒకే దగ్గర 200 మందికిపైగా మావోయిస్టులు..నది దాటుతున్నారు.. డ్రోన్ వీడియో

గత కొంతకాలంగా మన్యంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉదృతం చేశారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, తెలంగాణ పోలీసులు ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా సరిహద్దులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత వారం తెలంగాణ డీజీపీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు తీసిన డ్రోన్ కెమెరా వీడియో ఒకటి బయటకు వచ్చింది. సుమారు 200 నుంచి 250 మంది సభ్యులున్న మావోయిస్టు దళం సుక్మా జిల్లా కిష్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలొడీ అటవీ ప్రాంతంలో సంచరిస్తునట్లుగా తెలుస్తుంది. వీరు వాగు దాటుతుండగా డ్రోన్ కెమెరా సాయంతో వీడియో తీశారు.

మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో అధికారులు అపప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి