మేడ్చల్ లో తప్పిపోయాడు.. ఔటర్ రింగ్ రోడ్ పక్కన శవమై కనిపించాడు.

మేడ్చల్ లో తప్పిపోయాడు.. ఔటర్ రింగ్ రోడ్ పక్కన శవమై కనిపించాడు.

కొద్దిరోజుల క్రితం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో ఐదేళ్ల అతియాన్ అనే బాలుడు తప్పిపోయాడు. బయటకు వెళ్లిన కుమారుడు రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితులుగా ఉన్న కొందరిని విచారించారు. వారి నుంచి వివరాలు రాబట్టారు. సుదర్శన్ శర్మ అనే వ్యక్తిని విచారించడంతో అసలు విషయం బయటపడింది.

ఆ బాలుడు ఉంటోన్న ఇంట్లోనే బీహార్ వాసి సుదర్శన్ శర్మ అద్దెకు ఉంటున్నాడు. అతడితో కలిసి షేర్ చాట్ వీడియో తీసుకునేందుకు సుదర్శన్ శర్మ ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పై నుంచి కిందపడి మృతిచెందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. బాలుడు మృతి చెందటంతో భయంతో ఆ మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్ పక్కన పడేశాడని సుదర్శన్ శర్మ పోలీసులకు తెలిపారు. సుదర్శన్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి