ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వీరిద్దరిదే ( మిల్ గ్రామ్, విల్సన్ )

nobel prize for economics for paul mil gram and robert wilson

ఇప్పటికే ఫిజిక్స్ , మెడికల్ విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించిన నోబెల్ కమీటీ ఆర్థిక శాస్త్రం విభాగంలో మరో ఇద్దరికి బహుమతిని ప్రకటించింది.

ఆర్థిక శాస్త్రంలో విశేష కృషి చేయడమేకా అనేక మెరుగైన విధానాలను విజయవంతంగా ప్రతిపాదించినందుకు పాల్ మిల్ గ్రామ్ తో పాటు రాబర్ట్ విల్సన్ లకు ఈ అవార్డు వచ్చింది.

వేలం ప్రక్రియలు సజావుగా సాగడానికి సిద్ధాంతాలను సరళీకరించడానికి వీరు చేసిన కృషి ఈ అవార్డు దక్కింది.వీరు ప్రతిపాదించిన సిద్ధాంతాలు టేలికామ్ స్పెక్ట్రమ్ / రేడియో తరంగాలు వంటి వాటిని వేలం నిర్వహించేప్పుడు లేదా సంస్థలకు కేటాయించేప్పుడు బాగా ఉపయోగపడినట్టు కమీటీ గుర్తించింది.ఇక మిల్ గ్రాం మరియు విల్సన్ ను  స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తూ తమ పరిశోధనలకు కొనసాగిస్తూ ఈ కొత్త సిద్దాంతాలను ఈ నాటి పరిస్థితులకు తగినట్టుగా ప్రతిపాదించారు.

వీరి సిద్ధాంతాలు టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న ఈ ఆధునిక కాలంలో టేక్నాలజీ రంగంలో జరిగే అనే బిడ్డింగ్ మరియు వేలం ప్రక్రియలను అత్యంత సులభతరంగా మార్చాయని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి