శనివారం బెజవాడ దుర్గమ్మను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భగవత్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయ ఈఓ, ఇతర అధికారులు దగ్గరుండి ఆయనకు దర్శనం చేయించారు..
అంతకు ముందు మేళతాళాలతో స్వాగతం పలికారు. సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం ఆలయ పండితులు మోహన్ భగవత్‌కు, ఇతర ఆర్ఎస్ఎస్ ప్రముఖులకు వేదాశీర్వచనాలు అందజేశారు. దుర్గ గుడి ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను మోహన్ భగవత్‌కు ఇచ్చారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి