ఎంత కష్టపడినా ఇంతే.. పార్టీ పెట్టుకుంటేనే బెటర్ ఏమో అన్నా – రేవంత్ అనుచరుల డిస్కషన్

కార్యకర్తల మనోవేదన అర్థం చేసుకున్నట్లు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. ఇటీవల కార్యకర్తల సమావేశంలో సీఎం జగన్ నాయకత్వంపై.. అతని పోరాటంపై చేసిన వ్యాఖ్యలు బలాన్ని ఇస్తున్నాయి. 2014లో....

MP Revanth Reddy Followers unhappy with congress party
MP Revanth Reddy Followers unhappy with congress party

ఒక్కరే కష్టపడుతున్నారు.. ఒక్కరే పోరాడుతున్నారు.. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నా కలిసి వచ్చే వారు కరువు అయ్యారు.. ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగే మోస్ట్ సీనియర్స్ అడుగడుగునా ఉన్నారు.. దుబ్బాకలో ఓడిపోయినా మారలేదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మట్టి కరిచినా మారలేదు.. ఇంకా ఎన్నాళ్లు ఈ పార్టీలో.. వృద్ధ నేతలను చంకలో పెట్టుకుని ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు.. ఇలా అయితే పార్టీలో ఎంత కష్టపడినా ఇంతే.. పార్టీ పెట్టుకుంటేనే బెటర్ ఏమో అన్నా.. ఇదీ రేవంత్ రెడ్డి అనుచరుల మాట. ఒట్టి మాటలు కాదు.. రేవంత్ రెడ్డి అన్న గ్రూప్ లో వస్తున్న సందేశాలు..

కార్యకర్తల మనోవేదన అర్థం చేసుకున్నట్లు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. ఇటీవల కార్యకర్తల సమావేశంలో సీఎం జగన్ నాయకత్వంపై.. అతని పోరాటంపై చేసిన వ్యాఖ్యలు బలాన్ని ఇస్తున్నాయి. 2014లో ఓడిపోయిన జగన్.. 2019లో 151 సీట్లు గెలవటమే కాదు.. ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీని గెలిపించుకున్న లీడర్ అనిపించుకున్నారు.. కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదు.. ఎన్నికల సమయానికి ప్రజలు ఎవర్ని సీఎంగా చూడాలి అనుకుంటున్నారో వాళ్లకు విజయం ఇచ్చేస్తారు.. అప్పటి వరకు పోరాటం చేస్తూ ఉండాలి.. నిరుత్సాహ పడొద్దు అని కార్యకర్తలకు ఉపదేశం చేశారు.

ఎంపీ రేవంత్ రెడ్డి మాటల్లో నిజం లేకపోలేదు.. కొడంగల్ లో ఓడిన తర్వాత మల్కాజిగిరిలో ఎంపీగా బంపర్ మెజార్టీతో గెలిచారు.. ఇది ప్రజల తీర్పునకు, రేవంత్ రెడ్డి పోరాటానికి ఇచ్చిన విజయం. మరి కాంగ్రెస్ పార్టీలో అలాంటి పోరాటం, ఉద్యమాలు నిర్మించే నాయకత్వం ఏదీ అంటూ ప్రశ్నిస్తున్నారు రేవంత్ అభిమానులు.

మీకు పీసీసీ చీఫ్ ఇచ్చినా.. వృద్ధ నేతలు, ఆయా జిల్లాల్లో చక్రం తిప్పే నేతలు సహకరించకపోతే పరిస్థితి ఏంటీ.. ఒక్కరే పోరాడి ఏం సాధించగలరు.. మీరు ఒక్క మాట అంటే.. ప్రత్యర్థుల కంటే ముందుగానే పార్టీలోని వారే ప్రశ్నిస్తుంటే జనంలో విశ్వసనీయత, నాయకత్వంపై నమ్మకం ఎలా వస్తాయి అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి పార్టీ పెడితేనే బెటర్.. ఒంటరి పోరాటంలో తాడోపేడో తేల్చుకోవచ్చు.. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా వెళితే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ కంటే బీజేపీ బలంగా కనిపిస్తోంది.. దీనికితోడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీకి మంచి స్పేస్ ఉంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి