22 అంతస్థు బిల్డింగ్ ఎడ్జ్ పై స్టంట్ : ఫోటోలోని వ్యక్తి కోసం వెతుకుతున్న ముంబై పోలీసులు

this mumbai man was in most wanted list of mumbai police

స్నేహితులతో కలసి సరదాగా స్టంట్ చేస్తే పాపులారీటీ వస్తుంది అనుకున్న ఓ వ్యక్తి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఎత్తైన ఒక బిల్డింగ్ ఎడ్జ్ లో కాళ్లు పైకి, చేతులు కిందకి పెట్టి స్టంట్ నిర్వహించి ఆ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బహుళ అంతస్థుల భవనంలోని 22 ఫ్లోర్ నుండి పక్కన ఉన్న సన్ సెట్ పైకి దూకిన అతను ఈ స్టంట్ ను చేశాడు. ఈ సన్ సెట్ వెడల్పు కనీసం 2 అడుగులు కూడా లేదు. కాళ్ళు పైకి చేతులు కిందికి పెట్టి చేసిన ఈ స్టంత్ మరో ఇద్దరు రికార్డు చేసినట్టు తెలుస్తుంది.

అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇలాంటి స్టంట్ చేసిన ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇటువంటి స్టంట్లకు మొదట్లోనే అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరింత మంది ఇలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు