నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవరిని వదిలేలా కనిపించడం లేదు.. తాజాగా ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే.. ఇక సోమవారం చేయించుకున్న కరోనా పరీక్షల్లో నటుడు, జనసేన నేత నాగబాబుకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. దింతో ఆయన హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. రెండు రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతూ బాధపడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని తేలింది.

దింతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారికీ ఫోన్ చేసి టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.. అయితే అదిరింది షూటింగ్ కి వెళ్లిన సమయంలోనే కరోనా సోకినట్లుగా తెలుస్తుంది.. కాగా కరోనా గతంలో రాజమౌళి, కీరవాణి కుటుంబాలకు వచ్చిన విషయం తెలిసిందే.. వారు ప్రస్తుతం కోలుకొని ప్లాస్మా దానం కూడా చేశారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి