వెబ్‌సిరీస్‌లు, లో బడ్జెట్ మూవీలకు కేరాఫ్‌గా ఉన్న ఓటీటీలు.. ఇప్పుడిప్పుడే బడా హీరోలు, పెద్ద బడ్జెట్ మూవీలను కూడా ఆకర్షిస్తున్నాయి. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం.. అప్పట్లో ఆగిన షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే పూర్తవతుండటంతో.. ఇప్పుడందరికీ ఓటీటీలే దిక్కవుతున్నాయి. తాజాగా నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్.. ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవలే మనాలీలో షూటింగ్ పూర్తి చేసుకున్న వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున NIA అధికారిగా నటిస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. మూవీ యూనిట్ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కే జై కొట్టింది.
అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.. చిత్ర బృందం ప్రకటించింది. అహిషోర్ సోల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న వైల్డ్‌డాగ్ మూవీని.. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్గా దియా మీర్జా, స్పెషల్ క్యారెక్టర్లో సయామీ ఖేర్ నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్ డాగ్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని.. మూవీ యూనిట్ తెలిపింది.