లోకేష్ హీరోగా.. తేజ దర్శకంలో సినిమా – అప్పట్లో చంద్రబాబు ప్లానింగ్

ఇదండీ సంగతి.. హీరో కాబోయి మంత్రి అయిన నారా లోకేష్ హిస్టరీ..

నారా లోకేష్.. మాజీ మంత్రి.. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి. ఇది ఇప్పటి చరిత్ర.. గతంలోకి వెళితే.. లోకేష్ ను హీరో చేద్దాం అనుకున్నారు తండ్రి చంద్రబాబు. అందు కోసం భారీ కసరత్తు జరిగింది.

తేజ డైరెక్షన్ స్టోరీ డిస్కషన్స్ :

2002లో చంద్రబాబు ముఖ్యమంత్రి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సీఎం.. విజనరీ నేత. ఆ సమయంలో లోకేష్ ను హీరో చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో టాప్ డైరెక్టర్ అయిన తేజతో డిస్కషన్స్ జరిగాయి. కథ చర్చించారు. దీనికి మామయ్య బాలయ్య సహాయ సహకారాలు అందించారు. యూత్ స్టోరీ. లవ్ యాంగిల్. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీతో లోకేష్ ను హీరోగా పరిచయం చేయటానికి అంతా సిద్ధం అయ్యింది. స్టోరీ ఫైనల్ అయ్యింది. ఇక సెట్స్ పైకి వెళ్లటం ఆలస్యం.

సడెన్ గా ఆగిపోయింది :

చంద్రబాబు సైతం ఓకే అన్నారు. లోకేష్ మేకోవర్ అయ్యింది. హీరోగా మారటానికి అంతా సిద్ధం.. ట్రయిల్ వేశారు.. డమ్మీ షూటింగ్ జరిగింది. హీరోయిన్ వేటలో ఉన్నారు. సడెన్ గా ఏమైందో ఏమో.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. హీరో కావాల్సిన లోకేష్ డ్రాప్ అయ్యాడు.

అప్పటి పత్రిక కథనం ఇప్పుడు బయటకు :

అది 2000 సంవత్సరం. ఆగస్ట్ 9వ తేదీ సంచిక. సంతోషం పత్రిక. మెయిన్ పేజీలో ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ హీరోగా తేజ చిత్రం అనే హెడ్డింగ్ కూడా ఉంది. ఆ తర్వాత దీనిపై పెద్దగా స్టోరీలు రాలేదు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. చంద్రబాబు పార్టీపై దృష్టి పెట్టారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోకేష్ ను హీరో చేయాలని ఆలోచన కూడా ఆ తర్వాత విరమించుకున్నారు. లోకేష్ కూడా సినిమా వైపు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇదండీ సంగతి.. హీరో కాబోయి మంత్రి అయిన నారా లోకేష్ హిస్టరీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి