లోకేష్ అమరావతి సమావేశంలో నవ్వులే నవ్వులు

లోకేష్ అమరావతి సమావేశంలో నవ్వులే నవ్వులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అమరావతిలో పర్యటించారు.. అమరావతి రాజధాని దీక్ష 301 రోజుకు చేరుకోవడంతో వారికీ సంఘీభావంగా లోకేష్ పెనుమాకలో పర్యటించారు.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. ఇసుక ధర, సిమెంట్ ధర సామాన్యుడు కొనలేని విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను ఒక్కటికూడా నెరవేర్చలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.

పింఛన్ పెంచుతానని చెప్పిన జగన్, పింఛన్ తీసుకునేవారిని మోసం చేశాడని వ్యాఖ్యానించాడు.. ఈ నేపథ్యంలోనే ధరల పెరుగుదల విషయం మాట్లాడుతుండగా లోకేష్ పెరిగిన వస్తువుల ధరల గురించి చెబుతున్నారు.. ఈ సమయంలోనే పక్కన ఉన్న ఓ వ్యక్తి మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచారని..

తాము ప్రశాంతంగా మద్యం తగలేకపోతున్నామని అన్నాడు.. దింతో సమావేశంలో నవ్వులు పూశాయి..సీరియస్ గా జరుగుతున్న సమావేశం ఒక్కసారిగా హాస్యంగా మారిపోయింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి