మోడీని 9 గంటలపాటు 100 ప్రశ్నలు అడిగిన సిట్ అధికారులు.. టపీ టపీ అని సమాధానం చెప్పారు.

మోడీని 9 గంటలపాటు 100 ప్రశ్నలు అడిగిన సిట్ అధికారులు.. టపీ టపీ అని సమాధానం చెప్పారు.

నరేంద్ర మోడీ, నేటి భారత ప్రధాని, నాటి గుజరాత్ ముఖ్యమంత్రి. ఓటమెరుగని నేతగా గుర్తింపు.. ఇవన్నీ ఓ వైపు. మోడీలో చాలామందికి తెలియని కోణం మరొకటి ఉంది. ఆ విషయం ఓ రిటైర్డ్ సీబీఐ అధికారి చెప్పే వరకు ప్రజలకు తెలియలేదు. మోడీ గురించి సీబీఐ మాజీ చీఫ్ తన పుస్తకంలో రాసుకున్న కొన్ని విషయాలు గురించి తెలుసుకుందాం

సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్‌కే రాఘవన్ ఈ పేరు చాలా మందికి సుపరిచితం.. ఈ అధికారి ఎందరో రాజకీయ నేతలను జైలుకు పంపారు. దేశంలో జరిగిన భారీ కుంభకోణాలపై విచారణ చేశారు. ఇక 2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల కేసును రాఘవన్ డీల్ చేశారు. సిట్ అధికారిగా ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న వారిని విచారించారు.

ఈ ఘటనకు సంబందించిన విషయాలను తన ఆత్మకథ ‘ఆర్కే రాఘవన్: ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్’ అనే పుస్తకంలో పొందుపరచారు. ఇక ఈ కేసులు విచారణలో భాగంగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు రాఘవన్, సుమారు 9 గంటల పాటు, 100 ప్రశ్నలు సందించారట రాఘవన్, ఈ ప్రశ్నలన్నిటికీ మోడీ విసురుకోకుండా చాలా సంయమనంతో సమాధానం చెప్పారంట.

ఇక విచారణ సమయంలో సిట్ అధికారులు టీ ఇచ్చినా కూడా తీసుకోలేదని రాఘవన్ తన పుస్తకంలో రాశాడు. అంతే కాదు వాటర్ బాటిల్ కూడా తనతో తెచ్చుకున్నారని తెలిపారు. అధికారులకు ఆయాసం వచ్చి కాసేపు రెస్ట్ తీసుకోండి అని మోడీని అడిగితే, లేదు మీ ప్రశ్నలు కొనసాగించండి అంటూ సింపుల్ గా సమాధానం చెప్పారంట. ఇక అధికారులకు రెస్ట్ కావలసి వచ్చి దింతో మోడీకి చెప్పి మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకున్నారంట అధికారులు. ఈ విషయాలను రాఘవన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

మోడీకి ఎనేర్జిటిక్ లెవెల్స్ బాగున్నాయని తెలిపారు. ఒక్క ప్రశ్నకూడా దాటవేసే ప్రయత్నం చెయ్యలేదని రాఘవన్ తెలిపారు. తన సర్వీస్ లో ఇటువంటి విచారణ ఎప్పుడు జరగలేదని అన్నారు. చాలామంది ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేస్తారని వారు వివరించారు. 2012 ఫిబ్రవరిలో గుజరాత్ అల్లర్లపై సిట్ తన దర్యాప్తును ముగించింది. మోదీ, సీనియర్ అధికారులు సహా 63 మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు