రియా.. రకుల్ కు ఇచ్చింది – రకుల్ ఎవరికి ఇచ్చింది – నోటీసులకు రంగం సిద్ధం

ఈ మధ్యలో హైదరాబాద్ వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సమయంలోనూ ముంబైలోనే ఉన్నారు రకుల్. రియాకు

హిందీ సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ కేసు.. తెలుగు ఇండస్ట్రీకి చుట్టుకుంటోంది. రియా ఇచ్చిన 25 మంది సినీ ప్రముఖుల పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఈ విషయాన్ని నార్కోటిక్ బ్యూరో అధికారుల దగ్గర లిస్ట్ ఉంది.. ఈ లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది.

తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఇచ్చింది :

రియా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కు వచ్చిన డ్రగ్స్.. ఆమె ద్వారా ఎవరెవరికి చేరాయి.. ఎక్కడెక్కడికి చేరవేసింది.. ఎవరెవరు తీసుకున్నారు.. ఇదే బిగ్ క్వశ్చన్. రియా చెప్పిన వివరాల ప్రకారం నార్కోటిక్ బ్యూరో అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రియా చెప్పిన పేర్లలోని కొందరికి నోటీసులు పంపించనున్నారు ముంబై అధికారులు. ఆ నోటీసుల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో ఉన్న రకుల్ :

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. తెలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. ముంబైలోని ఆమె ఇంటికి నోటీసులు పంపించిన వెంటనే.. ఆమె ముంబై ఫ్లయిట్ ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత ముంబైలోనే ఉన్న రకుల్.. ఈ మధ్యలో హైదరాబాద్ వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సమయంలోనూ ముంబైలోనే ఉన్నారు రకుల్. రియాకు మంచి స్నేహితురాలు కూడా. రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే రియా నుంచి డ్రగ్స్ తీసుకుంది. ఇదే విషయాన్ని విచారణలో చెప్పింది రియా.

రియా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తే పరిస్థితి ఏంటీ.. ఆమెతో టచ్ లో ఉన్న వారిలో ఆందోళన ఇదే.. ముంబైలో తీగ లాగారు.. డొంక తెలుగు సినీ ఇండస్ట్రీలో కదిలింది.. ఎవరెవరికి చుట్టుకుంటుంది అనేది బిగ్ క్వశ్చన్స్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి