నగరంలో పెరిగిపోయిన నేపాల్ దొంగలు.. తస్మా జాగ్రత్త

నగరంలో పెరిగిపోయిన నేపాల్ దొంగలు.. తస్మా జాగ్రత్త

హైదరాబాద్ నగరంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నేపాల్ గ్యాంగ్స్ ఇంట్లో పనికి చేరి అందిన కాడికి దోచేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఓ ఇంట్లో పనికి కుదిరాడు నేపాల్ పనిమనుషులు అక్టోబర్ 19 ఇంటి యజమాని ఆయన భార్య ఇద్దరు జాబ్ కి వెళ్లారు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉన్నారు. దింతో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోని బంగారం, నగదు దోపిడీ చేశారు.

అనంతరం పారిపోయారు. దోపిడీ జరిగిందని గ్రహించిన ఇంటి యజమాని నాచారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు 25 టీంలాగా ఏర్పడి వారిని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వెళ్లిన పోలీసులు.. కీలక నిందితులు మాయ, అర్జున్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా వీరు పదిలక్షల నగదు, తొమ్మిది తులాల బంగారం దోపిడీ చేశారు. ఇక ఈ ఘటనపై రాచకొండ సీపీ  మహేష్ భగవత్ మాట్లాడుతూ ఇంట్లో పనిమనుషులను పెట్టుకునే సమయంలో హాక్ యాప్ లో వారి వివరాలు నమోదు చెయ్యాలని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు