అమెజాన్ కొత్త సేల్ – ఒక్క రోజు మాత్రమే

మీ గృహ అవసరాలు, భద్రత, పరిశుభ్రత, గోడల ఆకృతి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు అవసరమైనవి వంటి విభాగాలలోని ఉత్పత్తులు స్మాల్ బిజినెస్ డే 2020 రోజున అందుబాటులో ఉంటాయి

అమెజాన్ కొత్త సేల్ - ఒక్క రోజు మాత్రమే

ఒకవేళ సడన్ గా ఏదైనా అవసరమైన వస్తువులు కొనాలి అనుకుంటే బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకునే వెసులుబాటు పలు ఈ -కామర్స్ సంస్థలు తీసుకొచ్చాయి. వాటిలో ఎంతో పాపులర్ అయ్యి పేరు తెచ్చుకున్నది అమెజాన్ ఒకటి. అది కూడా కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ తో ఆగలేదు నిత్యావసరాల సరుకులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కిచెన్ సామాగ్రి వంటి మరెన్నో ఆన్లైన్ లో లభిస్తున్నాయి.

ఇప్పుడు అమెజాన్ తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్‌ను 12వ తారీఖు డిసెంబర్ నెలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి అవసరాల కోసం ఇది మంచి డీల్ అని చెప్పాలి, డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది..అది ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఇటువంటి సేల్ అమెజాన్ నిర్వహించడానికి కారణం కళాకారులుకు, మహిళా వ్యాపారవేత్తలకు, స్థానిక దుకాణాలకు, చేనేత దారులుకు ప్రోత్సహిచేందుకు తీసుకువచ్చింది. ఈ సేల్ ముఖ్య ఉద్దెశం ఏంటంటే చిరువ్యాపారులకు మద్దతుగా నిలవడం కోసం..వారి వ్యాపారాలు వృద్ధ్ది చెందేలా చేయడమే.

మీ గృహ అవసరాలు, భద్రత, పరిశుభ్రత, గోడల ఆకృతి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు అవసరమైనవి వంటి విభాగాలలోని ఉత్పత్తులు స్మాల్ బిజినెస్ డే 2020 రోజున అందుబాటులో ఉంటాయని పేర్కొనింది. డిజిటల్ చెల్లింపులు పై 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది, అలాగే డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపులకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కోసం ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

హోమ్ డెకార్‌పై 50 శాతం, ఫర్నీషింగ్‌పై 60 శాతం, ఫర్నీచర్‌పై 50 శాతం, కిచెన్ అప్లయెన్సెస్‌పై 60 శాతం, డిన్నర్‌వేర్‌పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్‌పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్‌వేర్‌పై 70 శాతం, కిడ్స్ వేర్‌పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు ఈ సేల్ లో మీకు లభిస్తున్నాయి అని మనీష్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకముందు 2020 జూన్ 27న నిర్వహించిన స్మాల్ బిజినెస్ డే రోజున సేల్స్ బాగానే నడిచాయని, దాదాపు 45,000 మంది అమ్మకదారులకు ఆర్డర్ వచ్చింది అని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మంచి డీల్ వచ్చినపుడు మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు