ఇంటర్నెట్ కి అతుక్కుపోయిన జనాలు, ఎక్కువగా యూజ్ చేసిన యాప్స్ ఏంటో?

కరోనా పుణ్యమా అని మరో 25% శాతం ఇంటర్నెట్ ని జనాలు వాడారు అని, అంటే దాదాపుగా ఈ సంవత్సరం 33 లక్షల గంటలు ఇంటర్నెట్ లో గడిపారు అని ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది.

ఇంటర్నెట్ కి అతుక్కుపోయిన జనాలు, ఎక్కువగా యూజ్ చేసిన యాప్స్ ఏంటో?

ప్రపంచం మొత్తం డిజిటల్ టెక్నాలజీలతో ముందుకు దూసుకుపోతుంది, ఇంటర్నెట్ లేనిదే రోజు గడవడం కష్టం అయిపోతున్న స్టేజి కి వచ్చాము. అది ఆఫీస్ పని అయినా, ఫోటో/ వీడియో షేరింగ్, ఆడుకోవాలన్నా, చదువుకోవాలన్న, సినిమాలు చూడాలన్న, ఇంటర్నెట్ సహాయంతో వాడుతుంటాం. కరోనా పుణ్యమా అని మరో 25% శాతం ఇంటర్నెట్ ని జనాలు వాడారు అని, అంటే దాదాపుగా ఈ సంవత్సరం 33 లక్షల గంటలు ఇంటర్నెట్ లో గడిపారు అని ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది.

ఇంకా డిటైల్స్ లోకి వెళ్తే, ట్విట్టర్ కన్నా వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ జూమ్ మరియు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్ ఎక్కువ యూజ్ చేసారు అని అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. దీనికి ముఖ్య కారణం కరోనా లాక్ డౌన్ వలన కంపనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడమే. తద్వారా బిజినెస్ యాప్స్ మీద ప్రభావం గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. వచ్చే ఏడాది కూడా ఇదే జోరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 2020లో ఇంటర్నెట్ ఉపయోగించడానికి మరో కారణం మనకి ఎక్కువ టైం దొరకడంతో ఇక గేమ్స్, సినిమాలు తమ OTT ప్లేట్ ఫార్మ్స్ రిలీజ్ చేయడం.. వినియోగదారులు వాటిని చూస్తూ కాలక్షేపం చేసారు.

ఈసారి ఆండ్రాయిడ్ యూజర్స్ అప్లికేషన్ల డౌన్లోడ్ 10% పెరిగారు.. దీనితో 90 వేళా లక్షల మార్క్ ని దాటేసారు. అందులోనూ ఎక్కువగా గేమింగ్ అప్లికేషన్స్ పై మోజు చూపించారు, ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్లలో మన దేశం తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్ ప్రజలు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నట్టు నివేదికలో ఉంది.  ‘అమాంగ్ అస్’, ‘లూడో కింగ్’ వంటి మల్టిపుల్ ప్లేయర్స్ గేమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఎక్కువ సంఖ్యలో డౌన్లొడ్ చేసి యూజ్ చేసిన యాప్స్ లో- టిక్ టాక్ మొదటి స్థానంలో చోటు సంపాదించుకునది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ గూగుల్ మీట్, జూమ్ కూడా డౌన్‌లోడ్‌ల సంఖ్యా పెరగడంతో టాప్ 10లో స్థానాన్ని నిలిపుకున్నాయి. కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలవడం కుదరకపోయిన టిండర్ అప్లికేషన్ పై యువత ఎక్కువ సమయం గడిపారు.. అందుకు ప్రధాన అప్డేట్ గ్లోబల్ స్వైపింగ్,  వీడియో కాలింగ్ వంటి ఫీచర్స్ ని ఆడ్ చేయడం వలెనే వర్చ్యువల్ డేట్స్ సాధ్యమైంది. 2021లో ఇదే జోరు కొనసాగుతుందని, ఇంతకన్నా జనాకర్షణ పొందిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదని విశ్లేషకుల వివరణ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు