ఏపీలో ఉపసంహరణ కాలం.. ఎవరు ఎవరి ట్రాప్ లో పడ్డారు

పీఠం దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

హడావుడి నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం పరిపాటే. అధికారమో లేక అవకాశమో ఉందని అనుకూలంగా వ్యవహరించడం.. ఒక్కోసారి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇటీవల టీటీడీలో జరిగినట్లుగానే.. శారదా పీఠంలోనూ అదే జరిగింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తిరుమల స్వామివారి నగలు పోయాయని.. ముఖ్యమంత్రి ఇంటిని సోదాలు చేస్తే దొరుకుతాయంటూ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పటి శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు.. రమణదీక్షితులు చేసిన ఆరోపణపై అప్పటి టీటీడీ పెద్దలు.. ఏకంగా 200 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కాలం మారింది.. చంద్రబాబు పోయి.. జగన్ వచ్చారు. టీటీడీ అప్పట్లో వేసిన పరువునష్టం దావాను.. టీటీడీ విరమించుకుంటామని ప్రకటించింది. దీనికి సంబంధించి కోర్టుకు తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం రాజుకోవడంతో.. విరమించుకోవాలంటూ వేసిన దావాను.. ఉపసంహిరించుకుంటున్నట్లు ప్రకటించింది.

శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలపై వివాదం రాజుకుంది. ఆయన జన్మదిన వేడుకలకు సంబంధించి.. ఆలయ మర్యాదలు కోరుతూ.. దేవాదాయశాఖకు శారదా పీఠం లేఖ రాసింది. దీనిపై సదరు శాఖ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోని అర్చకులు వేడుకల్లో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. భారీఎత్తున విమర్శలు వచ్చాయి. వివాదం చెలరేగడంతో.. పీఠం దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

అంశం ఏదైనా ప్రతిపక్షం రాద్దాంతం చేయటం కామన్.. అలా అని అన్నింటినీ ఉపసంహరించుకుంటూ పోతే ఎలా.. గట్టిగా నిలబడితేనే కదా అబద్దం అయినా నిజం అయ్యేది.. జనాన్ని ఏమార్చేది. గతంలో జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడినట్లు.. ఇప్పుడు చంద్రబాబు ట్రాప్ లో జగన్ పడ్డారా ఏంటీ.. చంద్రబాబు అలా ట్రాప్ లో పడ్డారు కాబట్టే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి.. మీరు కూడా ట్రాప్ లో పడ్డారు అనుకుంటే.. రాబోయే ఎన్నికల్లో…

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు