ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. బోర్డర్ లో తీవ్ర ఆంక్షలు

ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. బోర్డర్ లో తీవ్ర ఆంక్షలు

ambulances stop at telangana border
ambulances stop at telangana border

ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. బోర్డర్ లో తీవ్ర ఆంక్షలు

తెలంగాణ లాక్ డౌన్ లేదు.. ఇక హైదరాబాద్ కు ఏపీ నుంచి రాకపోకలు సర్వ సహజం.. ఏపీలో ఎవరికైనా అర్జంట్ ఆస్పత్రి అవసరం ఉంటే అందరి చూపు హైదరాబాద్ వైపే ఉంటుంది.. కరోనా టైంలో.. వేలాది మంది ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా.. ముందస్తు సమాచారం లేకుండా.. మే 10వ తేదీ సోమవారం నుంచి ఏపీ నుంచి వచ్చే వాహనాలకు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు పోలీసులు.

సాధారణ ప్రయాణికులను అడ్డుకుంటే పర్వాలేదు.. ఎమర్జెన్సీ కింద కరోనా పేషెంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్ లను సైతం పోలీసులు ఆపివేయటం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం ఏదో ముందు చెబితే ప్రత్యామ్నాయం చూసుకునే వారం కదా అంటున్నారు బాధితులు. ముందస్తు సమాచారం లేకుండా అంబులెన్స్ లో పేషెంట్లను తీసుకొస్తూ.. మార్గమధ్యంలో ఎలా ఆపివేస్తారని ప్రశ్నిస్తున్నారు బాధితులు.

కర్నూలు నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న అంబులెన్స్ లను ఆపుతున్న తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్ లో ఆస్పత్రి వివరాలు, అడ్మిన్ అవుతున్నట్లు కాగితాలు చూపించాలని కోరుతున్నారు. ఇలాంటి క్టిష్టమైన సమయంలో ఇది ఎలా సాధ్యం అని బాధితులు అంటున్నారు. ఆస్పత్రిలో బెడ్ ఉందని సమాచారం ఆధారంగా అంబులెన్స్ లో పేషెంట్ ను తీసుకుని హైదరాబాద్ వెళుతున్నామని.. ఇప్పటికిప్పుడు అన్నీ చూపించాలి అంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

పేషెంట్ సీరియస్ అయితేనే కదా.. అంబులెన్స్ లో వేలకు వేలు పెట్టి.. అత్యవసరంగా హైదరాబాద్ వస్తుంది.. ఇప్పుడే అన్నీ చూపించాలి అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క కర్నూలు రూట్ లోకే కాకుండా విజయవాడ, నల్గొండ రహదారుల్లోని ఏపీ – తెలంగాణ సరిహద్దుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మరో వైపు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలనుకునే వారికి ఈ-పాస్ విధానం మస్ట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది అనవసరంగా తిరుగుతున్నారని.. పని లేకపోయినా బయటకు వస్తున్న విషయాన్ని గుర్తించి ఆంక్షలు కఠినతరం చేసింది పోలీస్ శాఖ. కర్ఫ్యూ అమల్లో ఉన్నా.. మందులు అని.. మెడికల్ షాపుకు వెళుతున్నామని.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నామని చెప్పి ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు చూసీ చూడనట్లు వ్యవహరించిన పోలీస్ శాఖ.. అలాంటి వారిని.. కఠిన ఆంక్షలతో కట్టడి చేయాలని డిసైడ్ అయ్యింది.

ఇక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఎంటర్ కావాలంటే ఈ-పాస్ కంపల్సరీ. కరోనా మొదటి వేవ్ సమయంలో.. ఆన్ లైన్ ద్వారా పాస్ మంజూరు చేసేవారు. అలాంటి వారిని మాత్రం ఏపీలోకి అనుమతించేవారు. ఇప్పుడు కూడా అదే తరహా విధానాన్ని ప్రవేశపెట్టింది పోలీస్ శాఖ. 6 నుంచి 12 గంటల మధ్య అయితే పాస్ లేకుండా అయినా వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత జర్నీ చేయాలనుకుంటే మాత్రం పాస్ ఉండాల్సిందే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు