ఒప్పో కొత్త టెక్నాలజీ అదుర్స్

స్లైడ్-ఫోన్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ఒప్పో ధృవీకరించింది. నాలుగోవ చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్‌పోలో..జపాన్ కు చెందిన నెండో సంస్థతో ఒప్పో కలిసి ఈ స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ గురించి పూర్తిగా వివరించింది.

ఒప్పో కొత్త టెక్నాలజీ అదుర్స్

స్మార్ట్ ఫోన్ తయారీదారులు ప్రతిసారి ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చి మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఆల్రెడీ శామ్‌సంగ్ కంపెనీ డబల్ ఫోల్డబుల్ మొబైల్స్ తీసుకువస్తునట్టు తెలపగా..ఎల్జీ, షియోమీ వంటి స్మార్ట్ ఫోన్ సంస్థలు కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి పలు ఆలోచనాతలతో ఉన్నాయి. తాజా వీరి జాబితాలో ఒప్పో కూడా చేరింది.

స్లైడ్-ఫోన్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ఒప్పో ధృవీకరించింది. నాలుగోవ చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్‌పోలో..జపాన్ కు చెందిన నెండో సంస్థతో ఒప్పో కలిసి ఈ స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ గురించి పూర్తిగా వివరించింది.

స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ డీటెయిల్స్ లోకి వెళ్తే, ట్రిపుల్-హింజ్ ఫోల్డబుల్ స్క్రీన్ తో ఉండి, పొడవుగా కనిపించగా.. మడిచినప్పుడు క్రెడిట్ కార్డు వలె కనువిందు చేయనున్నది. దీనికి మూడు మడతలు ఉంటాయని, ఒక్కో మడత విప్పినపుడు 40 మిమీ పెరుగుతుంది. నోటిఫికేషన్‌లు, కాల్ హిస్టరీ, మ్యూజిక్ ప్లేయర్ వంటి వాటిని మొదటి స్క్రీన్ స్లైడ్ చేస్తే కనిపించనున్నాయి. ఇక రెండవ సారి స్క్రీన్ స్లైడ్ చేస్తే సెల్ఫీలు తీసుకోవటానికి 80 మి.మీ డిస్‌ప్లే తెరుచుకుంటుంది.

గేమింగ్, మల్టీ-టాస్కింగ్ లేదా వీడియోలను చూడటం కోసం మొత్తం స్క్రీన్‌ను స్లైడ్ చేస్తే సరిపోతుంది. వీటితో పాటు స్క్రీన్ పరిణామం సగం వరుకు తగ్గించుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. ఒకవైపు మ్యూజిక్ ప్లే/స్టాప్ ,మ్యూట్, వాల్యూమ్ షట్టర్ వంటి బటన్లు ఉండగా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాధారణ ఛార్జింగ్ తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుందని స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ వీడియోలో పరిచయం చేసింది. ఇది స్టైలిష్ గా అట్ట్రాక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయగా..ఎంతమంది స్మార్ట్ ఫోన్ ప్రియుల చేతులో ఉంటుందో మరి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు