జెడ్పీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు టీడీపీ : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

జెడ్పీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు టీడీపీ : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

tdp suprem court
tdp suprem court

జెడ్పీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు టీడీపీ : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహించాలంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు స్వయంగా ప్రకటించారు టీడీపీ నేత వర్ల రామయ్య. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. నాలుగు వారాల గడువు ఉండాలన్న నిబంధనను కాదని ఎన్నికల సంఘం ఎలా షెడ్యూల్ విడుదల చేస్తుందని ప్రశ్నించారు.

ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని.. సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నట్లు స్వయంగా ప్రకటించారు వర్ల రామయ్య. దీన్ని ఇంతటితో వదిలేది లేదని శపథం చేశారు. ఏప్రిల్ 7వ తేదీన హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.. ఏప్రిల్ 8వ తేదీ సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నామని.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఉన్నామని కూడా చెప్పారు వర్ల రామయ్య.

జెడ్పీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత టీడీపీ సుప్రీంకోర్టుకు వెళుతుందనే ప్రచారం జరిగింది. కొన్ని వర్గాలు వాటికి కొట్టి వేశాయి. ఈ విషయాన్ని వర్ల రామయ్య అధికారికంగా ప్రకటించటంతో కన్ఫామ్ అయ్యింది.

జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటానికి టీడీపీ నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న లాయర్ల ద్వారా పిటీషన్ దాఖలు చేయించనున్నారు.

ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతున్న క్రమంలో.. టీడీపీ దాఖలు చేసే పిటీషన్ విచారణ ఎన్ని గంటలకు వస్తుంది.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు