దేవినేని ఉమను అరెస్ట్ చేయొద్దు.. సీఐడీకి హైకోర్టు ఆదేశం.. రిలాక్స్ అయిన బాబు

దేవినేని ఉమను అరెస్ట్ చేయొద్దు.. సీఐడీకి హైకోర్టు ఆదేశం.. రిలాక్స్ అయిన బాబు

devineni uma
devineni uma

దేవినేని ఉమను అరెస్ట్ చేయొద్దు.. సీఐడీకి హైకోర్టు ఆదేశం.. రిలాక్స్ అయిన బాబు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేయొద్దని.. సీఐడీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. సీఐడీ విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కేసు విచారణ చేసే బాధ్యతను మరో అధికారికి అప్పగించాలని.. ప్రస్తుత అధికారిని తప్పించాలని ఆదేశించింది హైకోర్టు.

విచారణ పూర్తయ్యే వరకు.. మే 7వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో దేవినేని ఉమతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్లే అంటున్నారు.

హైకోర్టులో తెలుగుదేశం పార్టీకి, దేవినేని ఉమకు న్యాయం జరిగిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు