పోటీ పడి సీఎం జగన్ కాళ్లు మొక్కిన వైసీపీ నేతలు

సహజంగా కాళ్లు మొక్కటానికి.. మొక్కించుకోవటానికి సీఎం జగన్ సిగ్గుపడుతుంటారు అనే విషయం చాలా సార్లు చూశాం.. కానీ ఈసారి

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు చిత్తూరు జిల్లా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు అరుదైన స్వాగతం లభించింది. విమానం దిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు స్వాగతం పలికారు. శాలువాలు కప్పి.. పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. ఇక్కడో ఓ ఇంట్రస్టింగ్ దృశ్యాలు కనిపించాయి.

సీఎం జగన్ ను సన్మానించిన తర్వాత అందరూ ఆయన కాళ్లు మొక్కటానికి పోటీ పడ్డారు. జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆప్తులు తప్పితే మిగతా అందరూ కూడా కాళ్లు మొక్కారు. వీళ్లందరినీ తన చేతులతోనే పైకి లేపారు సీఎం జగన్. కాళ్లు మొక్కుతుంటే కొంత ఇబ్బంది పడ్డారు. ఆదాబ్ ఆదాబ్ అన్నట్లు అందరికీ నమస్కారం చేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీఎం జగన్ కాళ్లు మొక్కేవారి సంఖ్య బాగా పెరిగింది. పార్టీలో కొత్త సంస్కృతి వచ్చిందా ఏంటీ అనే టాక్ టీవీల్లో చూసిన వారికి వచ్చింది. కాళ్లు మొక్కటం వద్దని వారిస్తున్నా.. నేతలు మాత్రం కాళ్లు మొక్కటం ఆగటం లేదు. రేణిగుంట విమానాశ్రయంలోని ఈ దృశ్యాలు ఇంట్రస్టింగ్ చర్చకు దారి తీస్తున్నాయి. సహజంగా కాళ్లు మొక్కటానికి.. మొక్కించుకోవటానికి సీఎం జగన్ సిగ్గుపడుతుంటారు అనే విషయం చాలా సార్లు చూశాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు