ఫిబ్రవరి నెల పెన్షన్ లేనట్లేనా.. వాలంటీర్లు లేకుండా సాధ్యమేనా

ఫిబ్రవరి నెల పెన్షన్ లేనట్లేనా.. వాలంటీర్లు లేకుండా సాధ్యమేనా.. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెషన్లను మంజూరు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి ప్రభుత్వం

ఏపీలో ఇప్పుడు బడుగు, బలహీన వర్గాలతోపాటు పెన్షన్ తీసుకునే అందరిలో ఒకటే చర్చ.. ఫిబ్రవరి నెల ఒకటో తేదీ పెన్షన్ వస్తుందా రాదా అనేది హాట్ టాపిక్ అయ్యింది. పంచాయతీ ఎన్నికల క్రమంలో.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 3 లక్షల 60 వేల మంది గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు.. తమ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లను ప్రభుత్వానికి అందించాలని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఏపీలో 50 లక్షల మందికిపైనే ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 1న పెన్షన్లు మంజూరు చేయాలంటే వాలంటీర్లకు ఫోన్లు తప్పనిసరి.

స్మార్ట్ ఫోన్లలో బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెషన్లను మంజూరు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఇవ్వాలి అంటే ఎలా అని అధికారులు సైతం ఆలోచిస్తున్నారు.

తమ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా వేలిముద్ర తీసుకుని.. పెన్షన్ అందిస్తున్నారు. ఎస్ఈసీ ఆదేశాలతో ఫిబ్రవరి నెల పెన్షన్ అందించటానికి ప్రత్యామ్నాయం చూస్తుందా లేక ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల్లో మార్పులు వంటి పనులు వాలంటీర్లే చేపడుతుంటారు. ఇప్పుడు వీటికి కూడా బ్రేక్ పడినట్లు. ఫిబ్రవరి నెల పెన్షన్లు రానట్లే అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు