ఫేస్‌బుక్ లో బగ్?

ఇంత ఆదరణ పొందిన సోషల్ మీడియా అప్లికేషన్ లో తాజాగా ఒక బగ్ బయటపడింది. దీని వల్ల పర్సనల్ ఈ-మెయిల్, చిరునామా, పుట్టినరోజుల వివరాలు బయటపడుతున్నట్టు సౌగత్ పోఖారెల్, ఒక భద్రతా పరిశోధకుడు వెల్లడించారు.

ఫేస్‌బుక్ లో బగ్?

ప్రతి స్మార్ట్ ఫోన్లో ఫేస్‌బుక్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది, అలాగే దీన్ని వాడకం కూడా బానే ఉంటుంది. దాదాపుగా నెలకి 27 కోట్ల జనాభా చురుకుగా ఉంటున్నారని ఆ సంస్థ ప్రకటించింది. ఇంత ఆదరణ పొందిన సోషల్ మీడియా అప్లికేషన్ లో తాజాగా ఒక బగ్ బయటపడింది. దీని వల్ల పర్సనల్ ఈ-మెయిల్, చిరునామా, పుట్టినరోజుల వివరాలు బయటపడుతున్నట్టు సౌగత్ పోఖారెల్, ఒక భద్రతా పరిశోధకుడు వెల్లడించారు.

మాములుగా మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో సైన్ అప్ చేయడానికి వ్యక్తిగత ఈ-మెయిల్, పుట్టినరోజు డేట్, అడ్రస్ ఇస్తాము. అందుతున్న సమాచారం ప్రకారం ఈ బగ్ ద్వారా మన డీటెయిల్స్ బహిర్గతం అవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. మరో పక్క సైబర్ క్రిమినల్స్ ఎక్కువవడంతో, ఇటువంటి సున్నితమైన వివరాలు తెలుసుకుని దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్, తన కొత్త ఫీచర్ కోసం పరీక్షలు చేస్తున్న సమయంలో బగ్ గుర్తించినట్లు పోఖరెల్ వివరించారు. బిజినెస్ ఖాతా వారికి ఒక సరికొత్త ఫీచర్ ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ టూల్ పరీక్ష చేస్తున్న దశలో ఇలా జరుగుతుందని అనుమానించారు. ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ, బిజినెస్ ఖాతా వారికి కొత్త అప్డేట్ తీసుకొస్తున్న తరుణంలో సౌగత్ పోఖారెల్ బగ్ ఉన్నట్టు గుర్తించారు.

అక్టోబర్ లో నిర్వహించిన ఈ బిజినెస్ టూల్ టెస్ట్ ప్రకారం..వినియోగదారులు షేర్ చేసిన మెసేజ్, ఇతర వివరాలు లీక్ అయినట్టు, వెంటనే సమస్య ను గుర్తించి పరిష్కరించాం అని చెప్పారు. అంతే కాకుండా బగ్ ని గుర్తించిన పరిశోధకుడికి బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద బహుమతి ఇచ్చాము అని వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు