రానా, కోహ్లీకి, మద్రాసు హైకోర్టు నోటీసులు‌

రానా, కోహ్లీకి, మద్రాసు హైకోర్టు నోటీసులు‌

ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో డబ్బులు పోగుట్టుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చాలామంది దీనికి బానిసలైపోయారు. ఆర్ధికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై కొందరు మద్రాస్ హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు సంబందించిన యాప్స్ ప్రకటనల్లో నటిస్తున్న సెలెబ్రెటీలకు నోటీసులు పంపింది.

వారిలో ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, సినీ నటుడు దగ్గుబాటి రానా, సుదీప్, ప్రకాష్ రాజ్ ఉన్నారు. కాగా నోటీసులు అందుకున్న వారు నవంబర్ 19 లోగ వివరణ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఎందుకు ఇటువంటి ప్రకటనలలో నటించాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు