విజయ్ మాల్యా తరహాలో సుజనాచౌదరి ప్లాన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది

గతంలో విజయ్ మాల్యా ఇలాగే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి పెట్టాపేడా సర్దుకుని

విదేశాలకు వెళ్లకుండా.. దేశం విడిచి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు, నోటీసులు ఉన్నా కూడా చంద్రబాబు అనుంగ మిత్రుడు, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అమెరికా ఎలా వెళ్లాలి అనుకున్నారు.. లుక్ ఔట్ నోటీసులు అంటే దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్, మోసాలు చేసే వారికి ఆయా శాఖలు ఇచ్చే నోటీసులు. అలాంటి వారు విదేశాలకు వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టులకు ఈ నోటీసులు వెళతాయి. చీటింగ్, మోసం చేసే వారు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే నోటీసు అది. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే సుజనాచౌదరికి ఈ విషయం తెలియంది కాదు.. అయినా కూడా.. ఆయా దర్యాప్తు సంస్థలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా అమెరికా వెళ్లాలని ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవేళ విదేశాలకు వెళ్లాలి అనుకుంటే అందుకు సంబంధించి ఆయా దర్యాప్తు సంస్థలు, కోర్టుల నుంచి అనుమతి తీసుకుని వెళ్లాలి. సుజనాచౌదరి అలా చేయలేదు.

లుక్ ఔట్ నోటీసులు అంటే తెలియని అమాయకుడు అయితే కాదు సుజనాచౌదరి. ఇలాంటి నోటీసులు బస్సులు, రైళ్లకు ఇవ్వరు.. విమానాల్లో ప్రయాణించే వారికి ఇస్తారు. ఇక్కడ ఇంకో సందేహం కూడా ఉంది.. సుజనాచౌదరి ఉండేది హైదరాబాద్ లో.. ఎంపీగా ఉన్నా ప్రస్తుతం ఢిల్లీలో పెద్దగా కార్యక్రమాలు, పార్లమెంట్ సమావేశాలు ఏమీ లేవు. ఏ పని ఉన్నా అంతా వర్చువల్ మీటింగ్స్. సో.. సుజనాచౌదరి హైదరాబాద్ లోనే ఉన్నారు.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా వెళ్లటానికి ఎందుకు ప్రయత్నించారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో విజయ్ మాల్యా ఇలాగే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి పెట్టాపేడా సర్దుకుని చెక్కేశారు. ఇప్పుడు సుజనాచౌదరి కూడా అలాగే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా.. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లిపోవాలని ప్లాన్ చేశారా అనే చర్చ జరుగుతుంది. విజయ్ మాల్యా సైతం ఇలాగే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు.. పాపం సుజనాచౌదరి విషయంలో డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు తన గోతి తానే తవ్వకున్నట్లు అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు