రియల్ ఎస్టేట్ కథనాలు.. రోడ్డున పడిన 10 వేల మంది.. ఈ పాపం ఎవరిది.. ఎవరైనా కంప్లయింట్ ఇచ్చారా..

టీవీ9 రియల్ ఎస్టేట్ కథనాలు.. రోడ్డున పడిన 10 వేల మంది.. ఈ పాపం ఎవరిది.. ఎవరైనా కంప్లయింట్ ఇచ్చారా..

తెలుగు టీవీ9 న్యూస్ ఛానల్ లో వారం రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కథనాలు వస్తున్నాయి. 30 వేల కోట్ల రూపాయల స్కాం అంటూ ఒకటే పనిగా బ్రేకింగ్స్ వేస్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాం జరిగితే.. ఒక్కరు అంటే ఒక్క బాధితుడు పోలీస్ కంప్లయింట్ ఇవ్వలేదు.. రెరాకు ఫిర్యాదు చేయలేదు.. రోడ్డెక్కి ఆందోళనలు చేయలేదు.. ఆయా కంపెనీల ఆఫీసుల ఎదుట నిరసనలకు దిగలేదు.. దీక్షలు చేపట్టలేదు.. మోసపోయాం అని ఆత్మహత్యలూ ఇప్పటి వరకు జరగలేదు. అసలు బాధితుల వెర్షన్ లేకుండా వస్తున్న కథనాలతో.. కొనుగోలుదారులు – అమ్మకందారులు బాగానే ఉన్నారు.. అటూ ఇటూ కాకుండా పోయింది మాత్రం ఆ 10 వేల మంది.

ఈ 10 వేల మంది ఎవరో తెలుసా.. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని పెళ్లాం, పిల్లలను పోషించుకుంటున్న బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. అవును.. వీళ్లంతా ఇప్పుడు నడిరోడ్డుపైకి వచ్చారు. 30 వేల కోట్ల స్కాంలో ఎవరు నష్టపోయారో తెలియదు కానీ.. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 10 మంది ఉపాధి మట్టికొట్టుకుపోయింది. కరోనాతో ఏడాదిగా ఆర్థిక ఇబ్బందులు.. ఆ తర్వాత ధరణి విధానం వల్ల రోడ్డెక్కి లబోదిబో అన్నారు. ఇప్పుడు టీవీ9 వార్తలతో.. పెళ్లాం, పిల్లలతో నడిరోడ్డుపైకి వచ్చారు.

ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నాయా .. అందరికీ ఇవ్వటం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని జీవనోపాధి పొందుతూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు, వివిధ వెంచర్స్ లో పని చేస్తున్న 10 వేల మందిని నడిరోడ్డుపైకి ఈడ్చటంతోపాటు.. వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి ఈ ఛానెల్ కథనాలు.

టీవీ9 కథనాల వల్ల చిన్నాచితక, మధ్య తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయని.. అడ్వాన్సులు ఇచ్చినోళ్లు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని.. అలా లేకుండా ఇప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని.. ఈ పరిణామాలతో రావాల్సిన కమిషన్ కంపెనీలు ఇవ్వలేకపోతున్నాయని.. ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో జీవనోపాధి పొందటం ఇప్పట్లో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు ఓ కమిషన్ ఎజెంట్ ఉమామహేశ్వర్.

కరోనాతో ఆగిన వ్యాపారం.. జనవరి నుంచి మొదలైంది.. ఇప్పుడిప్పుడు కాల్స్ వస్తున్న సమయంలో.. టీవీ9 వార్తలు బాగా దెబ్బకొట్టాయంటూ కన్నీటి పర్యంతం అయ్యారు శివరాం అనే ఏజెంట్.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై కొన్ని శక్తులు కావాలని.. కొన్ని సంస్థలను టార్గెట్ చేసి వార్తలు ఇస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది. రాబోయే రోజుల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేయటం సాధ్యమయ్యేలా లేదు.. ఏదో జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు భాస్కర్ రెడ్డి అనే వెంచర్ ఓనర్.

ఎవరి ప్రయోజనాలు.. ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్లకు ఉన్నాయి.. పెద్దోళ్లే బతకాలని రాసిపెట్టి ఉంటే.. చిన్న వ్యాపారులను బిచ్చగాళ్లుగా మార్చాలనే లక్ష్యం ఉన్నప్పుడు.. భవిష్యత్ లో వ్యాపారం చేసి నష్టపోయే కంటే.. ఆ భారం కొనుగోలుదారులపై వేసి తప్పుకోవటం బెస్ట్ కదా అంటూ రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను నర్మగర్భంగా వివరించారు మరో వెంచర్ ఓనర్ శ్రీనివాసులరెడ్డి.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. టీవీ9 వార్తల వల్ల రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని జీవనోపాధి పొందరూ పెళ్లాం బిడ్డలను పోషించుకుంటున్న 10 వేల మంది మాత్రం ఇప్పుడు రోడ్డున పడ్డారు అనేది నగ్నసత్యం.. ఈ పాపం ఎవరిది.. ఎవరైనా కంప్లయింట్ ఇచ్చారా అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ జన్యూన్ క్వశ్చన్.

See also : ఒక్కటైన కమ్మ, రెడ్డి వ్యాపారులు – రియల్ ఎస్టేట్ కథనాలపై రహస్య మంతనాలు – బతకనిచ్చేలా లేరంటూ చర్చలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు