వెనక్కి తగ్గేది లేదు : పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Ap 10th Exam Schedule : పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి ప్రభుత్వాలు. సీబీఎస్ఈ బోర్డు సైతం టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా వేసింది. ఏ రాష్ట్రం ఎలా చేసినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్య విషయంలో వెనక్కి తగ్గటం లేదు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి.. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే పదో తరగతి పరీక్ష తేదీలు, షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ విద్యా శాఖ.

జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది విద్యా శాఖ. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు). జూన్‌ 7వ తేదీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌, జూన్‌ 8వ తేదీ సెకండ్‌ లాంగ్వేజ్‌, జూన్‌ 9వ తేదీ ఇంగ్లీష్‌, జూన్‌ 10వ తేదీ గణితం, జూన్‌ 11వ తేదీ ఫిజికల్‌ సైన్స్‌, జూన్‌ 12వ తేదీ బయోలాజికల్‌ సైన్స్‌, జూన్‌ 14వ తేదీ సోషల్‌ స్టడీస్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు