కుర్రోళ్ల బండ్లపై.. బండి బంపరాఫర్ – బీజేపీ హామీ దిమ్మతిరిగింది

బండి అమ్మిన డబ్బులకు కూడా సరిపోవటం లేదని కుర్రోళ్లు కుయ్యోమొర్రో అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుని..

హైదరాబాద్ సిటీ ఇప్పుడు కుర్రోళ్లోయ్.. కుర్రోళ్లు అంటూ పాడుకుంటోంది యూత్. ఊహించని బంపరాఫర్ ఇచ్చింది బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంపై బీజేపీ కూర్చుంటే.. సిటీలో కుర్రోళ్ల బండ్లపై ఉన్న చలాన్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీనే చెల్లించి.. వాటిని మాఫీ చేస్తుందని అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

కుర్రోళ్ల బండ్లపై బండి ఇచ్చిన హామీ అబ్బబ్బా ఏమి ఉందిరా అంటోంది యూత్. గల్లీల్లో తిరిగిన సీసీ కెమెరాలతో చలాన్ల బాదేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. లాఠీలు మానేసి కెమెరాలతో కుర్రోళ్ల గుండెలతోపాటు జేబులు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని 80 శాతం బండ్లపై ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఒక్కో బండిపై ఒక్క చలానా కాదు.. రెండు, మూడు, నాలుగు ఇలా బోలెడు ఉన్నాయి. బండ్లు అమ్మినా చలాన్లు కట్టలేని స్థాయిలో ఫైన్స్ ఉన్నాయి.

పాత బండి అమ్మాలంటే చలాన్లు క్లియర్ చేయాలి.. క్లియర్ చేసే చలాన్లు.. బండి అమ్మిన డబ్బులకు కూడా సరిపోవటం లేదని కుర్రోళ్లు కుయ్యోమొర్రో అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుని.. కుర్రోళ్ల బండ్లపై బండి చూపించిన విశ్వాసం, గుర్తింపునకు ఫిదా అవుతోంది యూత్.

బండ్లపై బండి సంజయ్ గారికి ఉన్న ప్రేమకు ఓట్లు ఎన్ని రాలుస్తాయో చూడాలి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు