90 సెకన్లకు ఒకరు.. 30 నిమిషాల్లో 20 మంది.. వార్డులోని అందరూ చచ్చిపోయారు..

90 సెకన్లకు ఒకరు.. 30 నిమిషాల్లో 20 మంది.. వార్డులోని అందరూ చచ్చిపోయారు..

20 patients die due to oxygen shortage
20 patients die due to oxygen shortage

కరోనా వైరస్ కంటే.. చికిత్సలోని లోపాలు, చికిత్సకు అవసరం అయిన ఆక్సిజన్ లేక చనిపోతున్న వారి సంఖ్య క్రమంలో పెరుగుతోంది. నిన్నటికి నిన్న ఆక్సిజన్ లీక్ అయ్యింది.. 30 నిమిషాలు ఆక్సిజన్ సరఫరా లేకపోవటంతో మహారాష్ట్ర నాసిక్ లో 24 మంది చనిపోయారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ టెంపుల్ ఆస్పత్రిలో ఏప్రిల్ 24వ తేదీ శనివారం తెల్లవారుజామున.. ఆక్సిజన్ లేక 20 మంది రోగులు చనిపోయారు. 30 నిమిషాల్లోనే.. వీళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవటంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా రోదనలతో దద్దరిల్లింది. ఆస్పత్రిలో ఏం జరుగుతుంది అంటూ డాక్టర్లు, నర్సులు అందరూ హైరానా పడ్డారు.

ఆక్సిజన్ సరఫరాలో లోపాలతోపాటు.. ఆక్సిజన్ లేకపోవటం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. ఆక్సిజన్ జీరో లెవల్ కు వచ్చే వరకు ఏం చేస్తున్నారంటూ అధికారులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఛీ.. యాక్.. ఏం దౌర్భాగ్యం అబ్బా అది.. ఆక్సిజన్ లేకపోవటం వల్ల.. ఇన్ని ప్రాణాలు పోవాలా.. 90 సెకన్లకు ఒకరు చొప్పున.. 30 నిమిషాల్లో వార్డులోని అందరూ చనిపోవటం దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. ఓ పేషెంట్ చనిపోయాడు అని నిర్థారణకు వచ్చిన వెంటనే.. ఆ పక్కనే ఉన్న బెడ్ పై రోగి సైతం చనిపోయాడని సమాచారం.. ఇలా 30 నిమిషాలపాటు.. ఆస్పత్రిలో చావులు జరిగాయి. రాయటానికే ఇంత బాధగా ఉంటే.. ఆస్పత్రిలో ఆ టైంలోని సిట్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. కేవలం ఆక్సిన్ అందకపోవటం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తేల్చేశారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు