ఉగ్రవాదుల మారణహోమం.. 22 మంది మృతి

ఉగ్రవాదుల మారణహోమం.. 22 మంది మృతి

ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పౌరులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న ఫ్రాన్స్ లో ఇద్దరినీ పొట్టన పెట్టుకోగా, ఇక సోమవారం అఫ్ఘానిస్తాన్ లో మారణహోమం సృష్టించారు.

కాబుల్ యూనివెర్సిటీపై దాడి చేసి 22 మందిని హతమార్చారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిష్టితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా యూనివర్సిటీ క్లాస్ రూమ్ లోకి వచ్చిన ఉగ్రవాదులు విద్యార్థులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో విద్యార్థులతో పాటు ఓ ప్రొఫెసర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఈ దాడికి పాల్పడింది తామే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఒప్పుకున్నారు. ఇక కాల్పులకు తెగబడ్డ ముష్కరులను ఆఫ్ఘన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా వారంలోనే రాజధానిలో ఒక విద్యా సంస్థపై రెండవసారి దాడి జరిగింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు