2D బాగా పని చేస్తుంది.. కరోనాకు మందు వచ్చేసినట్లే.. ఐసీయూ నుంచి కోలుకుంటున్న బాధితులు

2D బాగా పని చేస్తుంది.. కరోనాకు మందు వచ్చేసినట్లే.. ఐసీయూ నుంచి కోలుకుంటున్న బాధితులు

2d medicine for corona
2d medicine for corona

2D బాగా పని చేస్తుంది.. కరోనాకు మందు వచ్చేసినట్లే.. ఐసీయూ నుంచి కోలుకుంటున్న బాధితులు

కరోనాకు మందు లేదు అనే బాధ తీరినట్లే.. ఎందుకంటే.. డీఆర్ డీవో డెవలప్ చేసిన 2D గ్లూకోజ్ మందు బాగా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి మార్కెట్ లోకి వచ్చిన ఈ మందుతో.. ఎంతో మంది ఐసీయూ నుంచి కోలుకున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.

10 రోజుల క్రితం సూర్యపేటకు చెందిన సత్యనారాయణ అనే 55 ఏళ్ల వ్యక్తి.. కరోనా బారిన పడ్డాడు. అత్యవసర చికిత్స అవసరం అయితే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్నాడు. అయితే 2డీ మెడిసిన్ ఉపయోగించటం వల్ల.. కేవలం మూడు రోజుల్లోనే ఐసీయూ నుంచి బయటపడ్డాడు.

2డీ మెడిసిన్ తీసుకోవటం వల్ల.. శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తిని 95 శాతం నిరోధించటంతోపాటు.. కరోనా వైరస్ కణాలను చంపేస్తుంది. కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా.. 2డీ మెడిసిన్ ద్వారా కరోనాను జయించాడు సత్యనారాయణ. 2డీ మెడిసిన్ కరోనాకు బాగా పని చేస్తుందని.. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉపయోగించటం వల్ల ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు.

కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటనే.. డాక్టర్ల సూచనల, సలహాల మేరకు మాత్రమే 2డీ మెడిసిన్ తీసుకోవాలని.. దీని వల్ల కరోనా వైరస్ విస్తరణ ఇతర శరీర భాగాలకు సోకకుండా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు.

2డీ మెడిసిన్ తో ట్రీట్ మెంట్ వల్ల స్టెరాయిడ్స్, రెమిడిసివర్ ఇంజక్షన్లు అవసరం లేకుండా బాధితులు కోలుకుంటున్నారు.

ప్రస్తుతం 2డీ మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే అందిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర వెయ్యి రూపాయల వరకు ఉంది. 55 ఏళ్ల వ్యక్తి.. ఐసీయూలో ఉండి కూడా.. రెండు డోసులతోనే రికవరీ కావటం ఇప్పుడు సంతోషించదగిన పరిణామం.

ఇన్నాళ్లు కరోనా చికిత్సకు మందు లేదు అని బాధపడే వారికి.. ఇప్పుడు ఇది సంజీవినిలా పని చేస్తుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు